Begin typing your search above and press return to search.
హీరోలే కాదండోయ్..హీరోయిన్లలోనూ వచ్చిందండోయ్!
By: Tupaki Desk | 19 May 2022 3:30 PM GMTటాలీవుడ్ ట్రెండ్ లో ఇప్పుడెన్నో మార్పులు గమనించ వచ్చు. 10 ఏళ్ల క్రితం టాలీవుడ్ వేరు..ఇప్పుడు వేరు అన్న వ్యాత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. హీరోలంతా కలిసి హెల్దీ వాతావరణంలో ముందుకెళ్తున్నారు. కలిసి సినిమాల్లో నటిస్తున్నారు. ఒకరి సినిమా వేడుకకకు మరో స్టార్ అతిధిగా వెళ్తున్నారు. అవసరం మేర వాయిస్ ఓవర్ లు అందించడం సహా గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడానికి సైతం రెడీగా అంటున్నారు. నేను..నువ్వు అనే తారతమ్యం లేకుండా అంతా ఒక్కటే అన్న చందంగా విధానం కనిపిస్తుంది.
ఇక హీరోయిన్ల విషయంలోనూ ఎన్నో మార్పులు. హీరోయిన్ గానే నటిస్తానని ఒకప్పుడు కనిపించేది. ఇప్పుడా రోజులు పోయాయి. ఎలాంటి పాత్ర అయినా పోషించి...వచ్చిన అవకాశంతోనూ ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఆ తర్వత ప్రతిభనే పైకి తీసుకొస్తుంది అన్న భావన బలంగా నటీమణుల్లో కనిపిస్తుంది. హీరోయిన్ గా ఫేం ఉన్నంత కాలం కొనసాగుతున్నారు. అటుపై అదే పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ కొనసాగడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు.
పరి పూర్ణ నటి అన్న అర్ధానికి అసలైన మీనింగ్ ఇప్పుడే కనిపిస్తుంది అన్న తీరున ఎంతో పాజిటివ్ గా ముందుకెళ్తున్నారు. ఇదంతా కాలం తెచ్చిన మార్పే. దీన్నే ఇప్పుడు అపగ్రేట్ అవ్వడం అంటున్నాం. అలా కాకపోతే ఎక్కడ నుంచి వచ్చామో తిరిగి అక్కడికే వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే నవతరం భామలు తెలివైన నిర్ణయాలతో కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. కొంత మంది భామల టర్నింగ్ ఓ సారి చూస్తే ఆ విషయాలు అర్ధమవుతాయి.
'ఎఫ్ -3'లో విక్టరీ వెంకటేష్ సరసన ఐటం పాటలో మెపిస్తున్న పూజా హెగ్డే అదే హీరోకి తర్వాతి సినిమాలో చెల్లి పాత్ర పోషిస్తుంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న 'కబీ ఈద్ కబీ దివాళీ' సినిమాలో వెంకీ పుల్ లెంగ్త్ రోల్ పోషిస్తున్నారు. ఇందులోనే పూజా బ్యూటీ వెంకి సిస్టర్ గా..సల్మాన్ కి గాళ్ ప్రెండ్ గా నటిస్తుంది. ఇక కీర్తి సురేష్ కి పాత్ర నచ్చితే స్టార్స్ చిత్రాల్లో సొదరిగా సైతం నటించడానికి రెడీగా ఉంటుందది 'అన్నాథై' తో రుజువు చేసింది.
ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కి సిస్టర్ పాత్ర పోషించింది కీర్తి. ఇప్పుడు 'భోళా శంకర్' లో మెగాస్టార్ చిరంజీవి కి కూడా చెల్లి పాత్రలోనే కీర్తి కనిపించబోతుందని సమాచారం. ముందుగా ఆ పాత్రకి సాయి పల్లవి ని అనుకున్నారు. కానీ ఆమె చిరుతో పోటాపోటీగా డాన్సులు వేసే నాయికగా మాత్రమే నటించాలని ఆశపడటంతో వచ్చిన అవకాశాన్ని వదులుకుంది.
ఇక యూత్ ఐకాన్ గా మారిపోయిన శ్రీలీల నటసింహ బాలకృష్ణ కి చెల్లి పాత్రలో నటిస్తుందని సమాచారం. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో 20 ఏళ్ల చెల్లి పాత్రకి శ్రీలీల పేరు తెరపైకి వస్తుంది.