Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ తో లీక్డ్ కిస్ MMS.. ఏమీ చేయ‌లేక‌పోయాను!

By:  Tupaki Desk   |   10 July 2023 4:00 PM
స్టార్ హీరోయిన్ తో లీక్డ్ కిస్ MMS.. ఏమీ చేయ‌లేక‌పోయాను!
X
స్టార్ హీరోయిన్ తో స్టార్ హీరో లిప్ కిస్ ఎంఎంఎస్ అప్ప‌ట్లో పెను సంచ‌ల‌న‌మైంది. అయితే ఈ పెద‌విముద్దు ఎంఎంఎస్ రూపం లో ఎలా లీక్ అయింది? అన్న‌దానికి ఇన్నాళ్టికి అత‌డు స‌రైన‌ స‌మాధాన‌మిచ్చాడు. ఆ స‌మ‌యం లో నేను ఏమీ చేయలేకపోయాను! అని అత‌డు తెలిపాడు. అది ఏమీ తెలియ‌ ని వ‌య‌సు అని కూడా అన్నాడు. ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరో ఎవ‌రు? స్టార్ హీరోయిన్ ఎవ‌రు? అంటే.. క‌పూర్ హీరో షాహిద్.. క‌పూర్ హీరోయిన్ క‌రీనా గురించే ఇదంతా. స్టార్ హీరో సైఫ్ ఖాన్ ని పెళ్లాడ‌క ముందు షాహిద్ క‌పూర్ తో దాదాపు ద‌శాబ్ధ‌కాలం పాటు డేటింగ్ లో ఉన్న క‌రీనా క‌పూర్ ఆ త‌ర్వాత అత‌డి నుంచి బ్రేక‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ జంట ప్రేమ‌ లో ఉన్న‌ప్పుడు ప‌బ్లిక్ రొమాన్స్ గురించి మీడియా లో చాలా ప్రొప‌గాండా సాగింది. 2004లో కరీనా కపూర్ ఖాన్ తో షాహిద్ లిప్ లాక్ వేసిన వీడియోక్లిప్ లీక్ అయి యూత్ లో సెన్సేష‌న‌ల్ గా మారింది. అయితే పెద‌వి ముద్దు లీక్ సమయం లో తాను నాశనమైనట్లు భావించానని ఏం చేయాలో తెలియలేదని షాహిద్ తెలిపాడు. జియో సినిమా 'బ్లడీ డాడీ'లో చివరిసారిగా కనిపించిన షాహిద్ కపూర్ తాజా ఇంట‌ర్వ్యూలో లీక్ అయిన కిస్ MMS గురించి బయటపెట్టాడు. షాహిద్ కపూర్ ఇష్క్ విష్క్ సినిమా తో అరంగేట్రం చేశాడు.

అతని చాక్లెట్ బాయ్ లుక్స్ ఆకర్షణ డ్యాన్స్ స్కిల్స్ సాలిడ్ యాక్టింగ్ స్కిల్స్ కి యువ‌త‌రం మంత్ర‌ముగ్ధుల‌య్యారు. షాహిద్ కపూర్ వెంట‌వెంట‌నే వ‌రుస‌ ప్రాజెక్ట్ లకు సంత‌కాలు చేసాడు. అదే స‌మ‌యం లో కరీనా కపూర్ ఖాన్ తో డేటింగ్ వ్య‌వ‌హారం లోను మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చాడు. ఇద్దరూ తమ బంధాన్ని మీడియా నుండి ఏనాడూ దాచలేదు. ఈ జంట‌ ప్రకటనలు ప్రతిసారీ హెడ్ లైన్స్ లో నిలిచాయి.. కరీనా కపూర్ ఖాన్ తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎలా శాఖాహారిగా మారిందో కూడా వెల్ల‌డైంది.

2004లో సోషల్ మీడియా లేదు..PDA అనే భావన ఉనికి లో లేదు. జబ్ వి మెట్ సెట్స్ నుండి లీక్ అయిన ముద్దుల వీడియో MMS చాలా రోజుల పాటు చర్చనీయాంశమైంది. ఇది ముంబై టాబ్లాయిడ్ లలో మొదటి పేజీ వార్తగా నిలిచింది. అయితే అప్ప‌ట్లో అది మార్ఫింగ్ చేసిన క్లిప్ అని అంద‌మైన జంట కొట్టిపారేసారు. షాహిద్ కపూర్ మిడి డేతో మాట్లాడుతూ.. MMS క్లిప్ పబ్లిక్ లోకి వ‌చ్చాక తాను నాశనం అయ్యానని చెప్పాడు. నేను 24 ఏళ్ల పిల్లవాడిని..నా గోప్యత పై దాడి జరిగినట్లు భావించాను. నన్ను నేను రక్షించుకోవడానికి నేను ఏమీ చేయలేక‌పోయాను! అని షాహిద్ పేర్కొన్నాడు. ఇది తన కు గందరగోళాన్ని మిగిల్చిందని ఏం జరిగిందో తాను ఆలోచిస్తూనే కాలం గ‌డిపాన ని అతడు చెప్పాడు.