Begin typing your search above and press return to search.

స్టార్ల సిస్టర్స్ తో హీరో ఎఫైర్

By:  Tupaki Desk   |   28 Jun 2017 11:05 AM GMT
స్టార్ల సిస్టర్స్ తో హీరో ఎఫైర్
X
ప్రస్తుతం బాలీవుడ్ మీడియా ఓ విషయంపై చాలా ఆసక్తికరమైన కథనాలు ప్రచురిస్తోంది. అసలు గతంలో టాలీవుడ్ యాక్టివిటీస్ ని బాలీవుడ్ మీడియా పెద్దగా పట్టించుకునేది కాదు కానీ.. బాహుబలి పుణ్యమా అని.. ఇక్కడికి సంబంధించిన ప్రతీ న్యూస్ అక్కడ హంగామా చేసేస్తోంది.

ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఓ తెలుగు- తమిళ హీరోకు సంబంధించిన న్యూస్ ఒకటి బాలీవుడ్ లో బాగా ప్రచారం అయిపోతోంది. స్టార్ సిస్టర్స్ తో ఈ హీరో ఎఫైర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడేసుకుంటున్నారు. తెలుగు.. తమిళ్.. హిందీల్లో ఈ హీరో నటించిన ఓ సినిమా విడుదల కానుండగా.. ఈయనకు స్టార్ల సోదరీమణులతో అఫైర్స్ నడపడం మహా అలవాటట. ఏకంగా తన భార్య సోదరితోనే రిలేషన్ మెయింటెయిన్ చేసేస్తున్నాడంటే.. ఈ విషయంలో ఎంతటి ఉద్దండుడో అర్ధం చేసుకోవాలట.

గతంలో కూడా తనతో సినిమాలు చేసిన ఇద్దరు స్టార్లకు చెందిన సోదరీమణులతో కూడా వ్యవహారం నడిపించేశాడని అంటున్నారు. తమతో సినిమాలు చేసేవారితో అఫైర్స్ నడిపే హీరోలు.. స్టార్లు చాలామందే ఉంటారు కానీ.. బహుశా వారి సిస్టర్స్ తో.. అది కూడా సెట్స్ పైనే రిలేషన్ నడిపించేసే ఏకైక ఇండియన్ యాక్టర్ ఈయనొక్కడే కావచ్చని బాలీవుడ్ టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/