Begin typing your search above and press return to search.
మరో తమిళ హీరో పొలిటికల్ ఎంట్రీ?
By: Tupaki Desk | 17 Aug 2020 5:31 AM GMTతమిళనాట తారలు రాజ్యాధికారం దిశగా బాగానే అడుగులు వేస్తున్నారు. కానీ జనాలే వారిని నమ్మడం లేదు. ఓట్లు వేసే పరిస్థితులు కనిపించడం లేదు.
ఇప్పటికే అగ్రహీరో కమల్ హాసన్ పార్టీ పెట్టి మొన్నటి సార్వత్రిక ఎన్నికల వేళ పరీక్షించుకున్నాడు. ఎన్నికల్లో ఒక్కసీటు దక్కక అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీంతో తిరిగి సినిమాలు చేసుకుంటూ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడు.
ఇక మరో సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడో రాడో కూడా తెలియని పరిస్థితి. ఓసారి వస్తానంటాడు.. మరో సారి తటపటాయిస్తాడు.. ఆయన కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా అవేవీ పట్టించుకోకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇప్పుడు తాజాగా తమిళ హీరోల్లో ప్రజల్లో ఫుల్ క్రేజ్ ఉన్న విజయ్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీచేస్తుందని.. విజయ్ కూడా పోటీచేస్తారని అంటున్నారు. ఇప్పటికే విజయ్ తండ్రి చంద్రశేఖర్ రంగంలోకి దిగి.. ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పార్టీ పేరును కూడా నమోదు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.
ఇలా కమల్, రజినీకాంత్ లతోనే కాని పనిని తాజాగా హీరో విజయ్ తలకెత్తుకున్నట్టు తెలుస్తోంది. మరి తమిళ రాజకీయాల్లో విజయ్ పోటీనిస్తాడా? ఊసురుమంటాడా అన్నది వేచిచూడాలి.