Begin typing your search above and press return to search.
ఇక్కడ విలన్ గా పాపులరైతే ఓటీటీకి ప్లస్సేగా!
By: Tupaki Desk | 16 Sep 2020 7:10 AM GMTఅక్కడ స్టార్ హీరో ఇక్కడ విలన్ అయితే అది ఓటీటీకి ప్లస్సే కదా! ప్రస్తుతం విజయ్ సేతుపతికి ఆ రకంగా మార్కెట్లో ప్లస్ అయ్యి బిజినెస్ అంతకంతకు పెరుగుతోందిట. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి - ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన విలేజీ డ్రామా `కా పేయి రణసింగం` ప్రత్యక్ష ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోందని సమాచారం. ఈ చిత్రం అక్టోబర్ 2 న జీ ప్లెక్స్ లో గ్రాండ్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. దీనికోసం ఓటీటీ రైట్స్ ధర బాగానే పలికిందట.
ఇదే కాదు.. విజయ్ సేతుపతి మరో చిత్రం `మమనీతన్` ఓటీటీ విడుదల కోసం చర్చిస్తున్నారట. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రానికి సీను రామసామి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీ అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
ఇక కోలీవుడ్ లో ఎంత పెద్ద అగ్ర హీరో అయినా కానీ టాలీవుడ్ లో విలన్ గా నటిస్తున్నారు సేతుపతి. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెనలో అతడి విలనీ రక్తి కట్టిస్తుందని చెబుతున్నారు. ఉప్పెన ఓటీటీలోనే రిలీజ్ కానుందని ప్రచారమవుతున్నా.. చిత్రబృందం వేచి చూసే ధోరణిని అవలంభిస్తోంది. ఇక రెండు భాషల్లో సేతుపతి సుపరిచితుడు కాబట్టి ఓటీటీ బిజినెస్ కి అది అన్నిరకాలా ప్లస్ కానుందనే భావిస్తున్నారు.