Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ హీరో నిర్మాత‌ను అలా ఏడిపిస్తున్నాడు!?

By:  Tupaki Desk   |   2 July 2023 12:55 PM IST
ప్ర‌ముఖ హీరో నిర్మాత‌ను అలా ఏడిపిస్తున్నాడు!?
X
టార్ హీరోల వెంట ప‌డి మ‌రీ అడ్వాన్సులు ఇచ్చేందుకు నిర్మాత‌లు సిద్ధంగా ఉంటారు. హీరోల‌తో స‌త్సంబంధాలు ఉంటేనే నిర్మాత‌ల‌కు మ‌నుగ‌డ‌. కాల్షీట్లు ఇవ్వాల్సిన పని లేకుండా చాలా మంది అడ్వాన్సులు ఇచ్చి హీరోల‌ను లాక్ చేస్తుంటారు. అయితే అలా అడ్వాన్స్ లు ఇచ్చి నిర్మాత‌లే లాక్ అయితే ఈ ప‌రిస్థితిని ఏమ‌ని అనాలి?

ఇటీవ‌ల ప‌లువురు త‌మిళ హీరోలు అడ్వాన్సులు తీసుకుని అనుకున్న స‌మ‌యంలో షూటింగుల‌కు రాక‌పోవ‌డంతో త‌మిళ‌ నిర్మాత‌ల సంఘంలో ఫిర్యాదులు అందుతున్నాయ‌ని స‌మాచారం. దాదాపు 14 మంది త‌మిళ తార‌లు నిర్మాత‌కు ఇచ్చిన క‌మిట్ మెంట్ల‌ను నెర‌వేర్చ‌నందున వారిపై త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మండ‌లి భావిస్తోంద‌ట‌. స‌ద‌రు తార‌లంద‌రికీ రెడ్ కార్డ్ జారీ చేసేందుకు ఆస్కారం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో వినిపిస్తున్న ఒక పెద్ద పేరు ధ‌నుష్‌. క‌మిట్ మెంట్ కి మారు పేరైన ధ‌నుష్ ఓ ప్ర‌ముఖ నిర్మాత నుంచి అడ్వాన్స్ తీసుకున్నా కానీ షూటింగుల‌కు స‌హ‌క‌రించ‌లేదుట‌. దీంతో అత‌డు నిర్మాతల మండ‌లిలో ఫిర్యాదు చేసారు. దీంతో ధ‌నుష్ కి రెడ్ కార్డ్ జారీ చేసే ఆలోచ‌న‌లో మండ‌లి ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ధ‌నుష్ లాంటి ప్ర‌భావ‌వంత‌మైన హీరోపై చ‌ర్య‌లు తీసుకోవ‌డం అంత సులువేమీ కాదు. అత‌డు నిర్మాత‌కు స‌హ‌క‌రిస్తాన‌ని మ‌రోసారి మాటిస్తే మండ‌లి సైలెంట్ అయిపోయేందుకు ఆస్కారం ఉంది. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ తీసుకుని వ‌డ్డీల‌ను ఆస్వాధించే హీరోలు నిర్మాత‌ల పెయిన్ ని అర్థం చేసుకుంటే బావుండేద‌ని ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ ధ‌నుష్ పై ఫిర్యాదు చేసిన సంస్థ ఏది? అంటే... పాపుల‌ర్ తేనాండాల్ ఫిలింస్ అత‌డిపై ఫిర్యాదు చేసింద‌ని స‌మాచారం.

ఉద‌య‌నిధిపైనా ఫిర్యాదులు

ఇంత‌కుముందు స్టార్ హీరో శింబుపై ఇలాంటి ఫిర్యాదులు నిత్య‌కృత్యంగా క‌నిపించేవి. కానీ ఇటీవ‌ల వ‌రుస‌గా ప‌లువురు త‌మిళ హీరోల ప్ర‌వ‌ర్త‌న‌పై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవ‌ల త‌మిళ యువ‌న‌టుడు నిర్మాత ఉద‌య‌నిధి త‌న సినిమా `ఏంజెల్` చిత్రీక‌ర‌ణ పూర్తి చేసేందుకు స‌హ‌క‌రించ‌డం లేద‌ని పాపులర్ త‌మిళ‌ నిర్మాత ఇటీవ‌ల మీడియా ముందు వాపోయిన సంగ‌తి తెలిసిందే. ఉద‌య‌నిధి న‌టించిన మామ‌న్న‌న్ సినిమాని త‌న సినిమా `ఏంజెల్` రిలీజ‌య్యే వ‌ర‌కూ రిలీజ‌వ్వ‌కుండా నిరోధించాల‌ని అత‌డు ప్ర‌య‌త్నించాడు. కోర్టుల ప‌రిధిలోను పోరాటం సాగించాడు. కానీ మామ‌న్నన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇటీవ‌ల విడుద‌లైంది. అయితే ఉద‌య‌నిధి మామ‌న్న‌న్ త‌ర్వాత న‌టించ‌న‌ని ప్ర‌క‌టించ‌డంతోనే స‌ద‌రు నిర్మాత ల‌బోదిబోమ‌న్నారు. హీరో- నిర్మాత‌ల న‌డుమ త‌మిళ‌ నిర్మాత‌ల మండ‌లిలో స‌యోధ్య కుదిర్చే ప్ర‌య‌త్నం సాగ‌నుంద‌నేది తాజా స‌మాచారం.