Begin typing your search above and press return to search.

అంటే ఆ హీరోపై రూమర్లు నిజమేనా??

By:  Tupaki Desk   |   25 July 2017 4:22 AM GMT
అంటే ఆ హీరోపై రూమర్లు నిజమేనా??
X
ఇప్పటివరకు ఏ తెలుగు హీరో కూడా ఇలాంటి ఎక్సట్రాలు చేసే ఉండడు. కాని ఇతను మాత్రం పక్క రాష్ట్రం నుండి ఇక్కడకు తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి వచ్చి.. ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్యూలో కాలర్ కు పెట్టుకున్న మైక్ తీసిపాడేసి వెళ్ళిపోయాడు. ఎంతోమంది హేమాహేమీలను ఇంటర్యూ చేసిన ఆ యాంకర్ కూడా ఇతగాడి నిర్వాకం చూసి ఆశ్చర్యపోయింది. తెలుగు ప్రజలు కూడా ఇవేం ఓవర్ యాక్షన్లరా బాబూ అంటూ అతన్ని పిచ్చతిట్లు తిట్టారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పుకోవాలి.

అసలు ఒక ఎమ్మెమ్మెస్ లీకేజ్ స్కాండల్ గురించి ప్రస్తావించగానే ఈ హీరో వాకౌట్ చేశాడు. అక్కడికి మనోడు సింపుల్ గా అవన్నీ జస్ట్ ట్రాష్‌ అని కూడా ఖండించి ఉండొచ్చు. వాళ్ళ రాష్ట్రంలో మీడియాను చక్కగా మ్యానేజ్ చేసి ఈ విషయం గురించి ఎక్కడా కూడా చర్చలేకుండా చేసుకున్నాడు. మన దగ్గర అట్టా ఎట్టా కుదురుద్ది. అందుకే ఇక్కడ అడిగేశారు. కాకపోతే విషయాన్ని ఖండించకుండా వాకౌట్ చేయడం చూస్తుంటే.. నిజంగానే ఇతగాడికి ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉందని.. ఇతని కారణంగా ఆమె విడాకులు తీసుకుందని.. అలాగే ఇతని ఎమ్మెమ్మెస్ లు నిజంగానే ఉన్నాయని.. వాటిలో ఇతను అనేకమంది హీరోయిన్లను లోబరుచుకున్నాడని.. అప్పట్లో వచ్చిన రూమర్లు ఉన్నాయి చూశారూ.. అవన్నీ నిజమే అనుకోవాలా?

ఓ రకంగా చూస్తుంటే.. ఆ రూమర్లు అబద్దమైతే వెంటనే ఖండించవచ్చు.. కాని నిజమైతేనే కదా.. ఇలా కోపం వచ్చి వాకౌట్ చేస్తారు అంటున్నారు సైకలాజికల్ నిపుణులు. ఏదేమైనా కూడా ఈ హీరో ఉత్తినే ఇక్కడ స్టార్ అయిపోవాలి కాని.. విషయాలు మాత్రం వెల్లడించకూడదు అడగకూడదు అన్న తరహాలో బిహేవ్ చేయడం చూస్తుంటే.. అసలు మన స్టార్ హీరోలు ప్రశ్నాపత్రం ముందే అడిగి మీడియాను కట్టడి చేయడం పెద్ద తప్పే కాదని అనిపిస్తోంది కదూ.