Begin typing your search above and press return to search.

కరోనావేళ ఆ అగ్రహీరో గొప్ప మనసు

By:  Tupaki Desk   |   4 April 2020 12:10 PM GMT
కరోనావేళ ఆ అగ్రహీరో గొప్ప మనసు
X
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ కలిసి ఈ కరోనా వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా తో అల్లకల్లోలంగా మారిన పరిస్థితుల్లో నిస్సహాయలైన పిల్లలు, మహిళలు, వృద్ధులను చేరదీశారు. వారికి గూడు కల్పించి భోజన సదుపాయాలు కల్పించారు. ఇందుకోసం ఏకంగా తమ 4 అంతస్థుల వ్యక్తిగత సినిమా కార్యాలయాన్నే క్వారంటైన్ కేంద్రంగా మలిచారు.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ 4 అంతస్థుల కార్యాలయాన్ని కరోనా వేళ అసహాయులైన ఏ దిక్కులేని స్ట్రీట్ చిల్డ్రన్స్ - మహిళలు - వృద్ధులకు పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలుపడం తో షారుఖ్ చేసిన సేవలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక స్వయంగా సేవ చేయడంతోపాటు పీఎం కేర్స్ ఫండ్స్ తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో వితరణ ప్రకటించారు. అయితే అది ఎంతమొత్తం అనేది తెలియరాలేదు.

ఇక కరోనా రోగులకు సేవలు అందిస్తున్న డాక్టర్ల కోసం 50వేల శరీర రక్షణ గౌన్లను అందించాలని షారుఖ్ ఖాన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక షారుఖ్ ఖాన్ ఫౌండేషన్ - ఏక్ సాత్ అనే మరో సంస్థతో కలిసి ముంబైలోని 5500 మందికి నెలరోజుల పాటు ఆహార అవసరాలు తీర్చనుంది. ఇక రోడ్లపై ఉండే అభాగ్యులకు 2వేల మందికి సరిపడా ఆహారాన్ని కూడా పంపిణీ చేయనున్నారు.

ఇలా షారుఖ్ ఖాన్ విరాళం ఇవ్వడంతో పాటు స్వయంగా రంగంలోకి దిగి సేవ చేయడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.