Begin typing your search above and press return to search.

స్టార్ హీరో తల్లి మృతి.. నటుడి భావోద్వేగ పోస్ట్

By:  Tupaki Desk   |   8 Sep 2021 6:10 AM GMT
స్టార్ హీరో తల్లి మృతి.. నటుడి భావోద్వేగ పోస్ట్
X
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి అరుణ భాటియా బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను సెప్టెంబర్ 3న ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఆరోగ్యం మరింత విషమించడంతో చికిత్స పొందుతూ అక్షయ్ తల్లి మృతిచెందింది.

ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘మా అమ్మ అరుణ భాటియా.. ఈరోజు ఉదయం ఈలోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వేరే లోకంలో ఉన్న నా తండ్రిని ఆమె కలుసుకోవడానికి వెళ్లారు. తల్లియే నా ప్రాణం. ఆమె మరణం వల్ల నాకు కలిగిన బాధను మాటల్లో వివరించలేను. ఈ బాధను భరించలేను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఓం శాంతి అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడు. అరుణ భాటియా మృతిపట్ల పలువురు సెలబ్రెటీలు, నెటిజన్లు సంతాపం తెలిపారు.

అక్షయ్ కుమార్ ప్రస్తుతం సిండ్రెల్ల సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రెండు వారాలుగా లండన్ లో సాగుతోంది. తన తల్లి అస్వస్థతకు గురైందని తెలియగానే అక్షయ్ కుమార్ హుటాహుటిన ముంబైకి చేరుకున్నారు.