Begin typing your search above and press return to search.
నేను కూడా దారుణమైన ట్రోలింగ్ బారినపడినవాడినే: దుల్కర్
By: Tupaki Desk | 25 Sep 2022 1:36 PM GMTఏ సినిమా ఇండస్ట్రీకి వెళ్లినా అక్కడ స్టార్ హీరోల వారసుల జోరు కనిపిస్తూనే ఉంటుంది. సాధారణంగా స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నాడగానే అవకాశం ఉంది కాబట్టి వస్తున్నాడనే చాలామంది అనుకుంటారు. అలా వచ్చినవారిలో టాలెంట్ ఉండదనీ .. స్టార్ హీరో వారసుడు కనుక భరించవలసిందేనని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చినవారికంటే తాము ఎక్కువగా కష్టపడవలసి ఉంటుందనీ, తమపైనే అంచనాలు ఎక్కువగా ఉంటాయని స్టార్ వారసులు చెబుతూ వస్తున్నారు.
ఇదే విషయాన్ని దుల్కర్ కూడా చెబుతున్నాడు. " ఒక స్టార్ హీరో వారసుడిగా అభిమానుల అంచనాలను అందుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. తండ్రికి తగిన తనయుడు అనిపించుకోవడానికి ఒక రేంజ్ లో కష్టపడవలసి ఉంటుంది.
అలాగే ఎలాంటి టాలెంట్ లేకపోయినా అవకాశం ఉంది గనుక హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు అనుకునేవారికి టాలెంట్ తో సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ సమయంలోనే ట్రోలింగ్ ను తట్టుకుని నిలబడవలసి ఉంటుంది. అది అనుకున్నంత తేలిక కాదు. ఎందుకంటే ఆ ట్రోలింగ్ చాలా దారుణంగా ఉంటుంది.
2016లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఉత్తమ నటుడిగా అవార్డును ఇచ్చింది. అందుకు సంబంధించిన ట్రోల్ ఒకటి నా కంట పడింది. "నీ అవార్డును అమ్మాలనుకుంటున్నావా .. అయితే దానిని నాకు ఇచ్చేయ్. నువ్వు కొన్నదానికంటే 50 వేలు ఎక్కువగా ఇస్తాను" అంటూ నన్ను ఉద్దేశించి ట్రోల్ చేశారు. అంటే అవార్డు నా ప్రతిభను బట్టి రాలేదనీ .. దానిని నేను కొనుకున్నాననేది వారి ఉద్దేశం. నిజంగా డబ్బుతో అవార్డులు తెచ్చుకోవాలనుకుంటే, నేను అంతకాలం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఆ కామెంట్ నన్ను చాలా బాధ పెట్టింది.
'అవార్డు అనేది మనం సాధించినదానికి మాత్రమే కాదు .. మున్ముందు సాధించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇచ్చేది. అందువలన ఈ కామెంట్స్ గురించి .. ట్రోలింగ్ గురించి ఎక్కువగా ఆలోచన చేయకు' అంటూ నా ఫ్రెండ్ నాకు సర్ది చెప్పడంతో నేను ఆ ఆలోచనలో నుంచి బయటికి వచ్చాను' అంటూ చెప్పుకొచ్చాడు. దుల్కర్ ఇటీవల తెలుగులో చేసిన 'సీతా రామం' తెలుగులో సూపర్ హిట్ అయింది. ఓవర్సీస్ లోను వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాంతో ఇప్పుడు ఆయన మరో తెలుగు సినిమాను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు.