Begin typing your search above and press return to search.
హోలీ డేకి రెడీ అవుతున్న యంగ్ హీరో
By: Tupaki Desk | 23 Dec 2021 12:30 PM GMT`RRR` సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. జనవరి 7న వారం ముందే పంగడ వాతావరణాన్ని తీసుకొస్తోంది. ఇదిలా వుంటే ఈ సినిమా కారణంగా పండగ రేసులో నిలిచిన `భీమ్లా నాయక్` సడన్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే. రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య `భీమ్లా నాయక్` పోటీ పడటం ఎందుకని మేకర్స్ ఈ చిత్రాన్ని బలవంతంగా పోటీ నుంచి తప్పించారు. దీంతో ఈ మూవీ ఫిబ్రవరి 25కు వెళ్లింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమా రిలీజ్ డేట్ మారడం మిగతా చిత్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో నిర్మాత దిల్ రాజు తను విక్టరీ వెంకటేష్, వరుష్ తేజ్‌లతో నిర్మిస్తున్న `ఎఫ్ 3` రిలీజ్ ని కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. `భీమ్లా .. ఫిబ్రవరి 25కు మారడంతో ఆ సినిమా రిలీజ్ డేట్‌ని బట్టి `ఎఫ్ 3` విడుదల తేదీని కూడా మార్చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల విడుదల తేదీలు మరో సినిమా రిలీజ్ కి ఇబ్బందికరంగా మారాయి.
అదే వరుణ్ తేజ్ నటిస్తున్న `గని`. కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చిలో విడుదల కావాల్సిందే అంటున్నారు. మార్చిలో గనక ఈ మూవీ రిలీజ్ ఆగితే జూన్ వరకు ఎదురుచూడక తప్పదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఫిబ్రవరిలో ముందు `ఆచార్య` ఆ తరువాతే `భీమ్లా నాయక్` విడుదల కాబోతున్నాయి.
అ నేపథ్యంలో `గని` ని మార్చిలో విడుదల చేయడమే కరెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. మరో ఆప్షన్ లేకపోవడంతో ఈ సినిమా రిలీజ్ కోసం హోలీ ఫెస్టివల్ డేట్ ని ఫిక్స్ చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట.