Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ సినిమా కోసం పడ్డ కష్టాలు గుర్తు చేసుకున్న స్టార్‌ హీరో

By:  Tupaki Desk   |   5 Nov 2021 11:30 AM GMT
సూపర్ హిట్ సినిమా కోసం పడ్డ కష్టాలు గుర్తు చేసుకున్న స్టార్‌ హీరో
X
కొన్ని సినిమాలు ఎప్పటికి గుర్తుండి పోతాయి.. బాలీవుడ్‌ ప్రేక్షకులు శ్రీదేవి మరియు అనీల్‌ కపూర్ ల పేర్లు ప్రస్థావనకు వచ్చిన ప్రతి సారి గుర్తు చేసుకునే సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా లమ్హే సినిమా ఒకటి. ఆ సినిమా లో అనీల్ కపూర్ మరియు శ్రీదేవిలు కలిసి నటించగా బ్లాక్ బస్టర్ అయ్యింది. వీరిద్దరి కాంబోలో సినిమాలు చాలా సూపర్‌ హిట్ అయ్యాయి కాని లమ్హే సినిమా చాలా ప్రత్యేకమైన విజయంగా నిలిచింది అనడంలో సందేహం లేదు. లమ్హే సినిమా విడుదల అయ్యి 30 ఏళ్లు పూర్తి అయ్యింది. ఇప్పటికి కూడా ఆ సినిమాను హిందీ ప్రేక్షకులు ఆధరిస్తూ అభిమానిస్తూనే ఉంటారు. అంతటి ఘన విజయంను సొంతం చేసుకున్న లమ్హే సినిమా కోసం చాలా కష్టపడ్డట్లుగా హీరో అనీల్‌ కపూర్‌ చెప్పుకొచ్చాడు.

సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అనీల్ కపూర్‌ సోషల్ మీడియా ద్వారా తన ఆనందంను షేర్‌ చేసుకున్నాడు. ఈ సందర్బంగా ఆయన లండన్ షెడ్యూల్‌ గురించి ఒక ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని చెప్పుకొచ్చాడు. లమ్హే సినిమాకు యశ్‌ చోప్రా నిర్మాత. ఆ సినిమా షూటింగ్‌ కోసం మొదట మేము లండన్ వెళ్లాం. ఆ తర్వాత శ్రీదేవి రావాల్సి ఉంది. ఆ సమయంలోనే శ్రీదేవి తండ్రి మృతి చెందడటంతో ఆమె రాలేక పోయింది. శ్రీదేవి రాకపోవడంతో నేను ఇండియాకు తిరిగి రావాలనుకున్నాను. ఆ సమయంలో నాకు రెండు సినిమాల షూటింగ్ ఇండియాలో ఉన్నాయి. అందులో ఒకటి నా సొంత నిర్మాణంలో ఉంది. ఆ సినిమాల షూటింగ్ కు వెళ్లకుంటే పెద్ద నష్టం కలుగుతుంది. లండన్‌ నుండి తిరిగి వచ్చి మళ్లీ వెళ్లాలంటే పెద్ద రిస్క్ తో కూడుకున్న పని. దాంతో యశ్‌ చోప్రా రిక్వెస్ట్‌ తో శ్రీదేవి వచ్చే వరకు లండన్ లో ఉండి పోయాము.

చిత్ర యూనిట్‌ సభ్యులం అందరం కూడా శ్రీదేవి లండన్ వచ్చే వరకు 20 రోజుల పాటు వెయిట్‌ చేశాం. ఆ సమయంలో హోటల్స్ బిల్స్‌ ఎక్కువ అవుతున్నాయని లండన్ లోని యశ్‌ రాజ్ స్నేహితుడి ఇంట్లో ఉండాల్సి వచ్చింది. శ్రీదేవి వచ్చిన తర్వాత అనుకున్న ప్రకారం సినిమాను పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత అంతా మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చాం. నా సినిమా షూటింగ్ షెడ్యూల్‌ క్యాన్సిల్‌ అవ్వడం వల్ల చాలా నష్టపోయాను. మరో సినిమాకు కూడా ఇబ్బంది కలిగింది. 20 రోజులు వేరే వాళ్ల ఇంట్లో లండన్ లో ఉండాల్సి రావడం చాలా కష్టం కలిగించింది అంటూ అప్పటి కష్టాలన్నింటిని అనీల్‌ కపూర్ గుర్తు చేసుకున్నాడు. అన్ని కష్టాలు కూడా సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన తర్వాత మర్చి పోయామన్నాడు. లమ్హే సినిమా నా కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమా అంటూ అనీల్ కపూర్‌ చెప్పాడు. శ్రీదేవి ఆ సినిమాలో చాలా అందంగా కనిపించి మరింత మంది బాలీవుడ్ ప్రేక్షకుల అభిమానంను సొంతం చేసుకుంది.