Begin typing your search above and press return to search.

నిర్మాతకు స్టార్ హీరో 4 కోట్ల షాక్

By:  Tupaki Desk   |   18 Nov 2016 1:30 AM GMT
నిర్మాతకు స్టార్ హీరో 4 కోట్ల షాక్
X
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సినీ పరిశ్రమలో పెద్ద కలకలమే రేపుతోంది. బ్లాక్ మనీతో భారీగా లావాదేవీలు జరిగే పరిశ్రమ కావడంతో మోడీ సర్కారు తాజా నిర్ణయంతో నిర్మాతలు.. హీరోలు.. దర్శకులు మామూలుగా ఇబ్బంది పడట్లేదు. వారం రోజుల నుంచి పరిశ్రమ ఒక రకమైన షాక్ లో ఉంది. ఇంతకుముందు పారతోషకాల్లో చాలా వరకు బ్లాక్ మనీ కనిపించేది. పెద్ద నోట్లే దర్శనమిచ్చేవి. ఇప్పుడు ఆ డబ్బుల్ని ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరికి వాళ్లు ఆ నోట్లను వదిలించుకునే పనిలో పడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ఒక స్టార్ హీరో.. తన నిర్మాత నుంచి తీసుకున్న 4 కోట్ల రూపాయల డబ్బుల్ని ఏం చేసుకోవాలో తెలియక.. ఆ నిర్మాతకే వెనక్కి ఇచ్చేసినట్లు సమాచారం.

ఆ హీరో పెద్ద ఫ్యామిలీకి చెందిన వాడు. పరిశ్రమలో బాగా పలుకుబడి ఉంది. ఆయనకు పొలిటికల్ కనెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. దీంతో హీరో డబ్బులు వెనక్కి ఇచ్చేయడంతో నిర్మాత ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఆ డబ్బంతా దాదాపుగా బ్లాక్ మనీయే అని సమాచారం. ఇప్పుడా నోట్ల కట్టల్ని ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాడు ప్రొడ్యూసర్. ఆయన దగ్గర ఇంకా చాలా క్యాష్ ఉన్నట్లు సమాచారం. ఈ నోట్లన్నింటినీ కొత్త నోట్లతో మార్పిడి చేయించుకోవడానికి ఉన్న మార్గాల కోసం ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. మొత్తంగా పరిశ్రమలో ఇలాంటి పరిణామాలు చాలానే జరుగుతున్నాయి. ఎవ్వరూ ఇప్పుడు డబ్బు రూపంలో పారితోషకాలు తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. చెక్కుల రూపంలోనే లావాదేవీలు నడుస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/