Begin typing your search above and press return to search.

దిశా ప‌టానీతో లిప్ లాక్ పై ఓపెనైన స‌ల్మాన్

By:  Tupaki Desk   |   2 May 2021 2:37 PM GMT
దిశా ప‌టానీతో లిప్ లాక్ పై ఓపెనైన స‌ల్మాన్
X
క‌థానాయిక‌ల‌తో లిప్ లాక్ వేసేందుకే ఇష్ట‌ప‌డ‌ని ఒకే ఒక్క స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ అన్న టాక్ ఉంది. కానీ ఆయ‌న కూడా ఆ రూల్ బ్రేక్ చేశారు. దిశా పటానీతో లిప్ లాక్ వేయ‌డంతో భాయ్ ఫ్యాన్స్ షాక్ తిన్నారు.

55ఏళ్ల స‌ల్మాన్ కి వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అనేది ప్రూవైంది. ఆయ‌న‌ వయస్సుకు ఆ ప‌ర్ఫెక్ట్ ఫిట్ రూపానికి ఏమాత్రం సింక్ అన్న‌దే కుద‌ర‌దు. ఇప్ప‌టికీ న‌వ‌య‌వ్వ‌న మ‌న్మ‌ధుడినే త‌ల‌పిస్తాడు. అంత గొప్ప‌ ఆరోగ్యకరమైన జీవనశైలి అతడిది. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ బాలీవుడ్ లో అత‌డే ది బెస్ట్ భాయ్.

ఈద్ కి భాయ్ హంగామా మొద‌లు కానుంది. కాప్ డ్రామా రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ థియేట‌ర్ల‌తో పాటు ఓటీటీలోనూ అందుబాటులోకి వ‌స్తోంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. తాజా ప్ర‌మోష‌న్స్ లో దిశా ప‌టానీతో లిప్ లాక్ మ్యాట‌ర్ ని స‌ల్మాన్ ఓపెన‌య్యారు.

మేమిద్ద‌రం ఒకే వయస్సులో ఉన్నామ‌ని అత‌డు జోక్ చేశారు. ``దిశా అద్భుతంగా న‌టించింది. చాలా అందంగా కనిపించింది. మేము కూడా ఒకే వయస్సు లో ఉన్న‌ట్టే ఉన్నాం. దిశా నా వయసును చూసేది కాదు. కానీ నేను ఆమెలాగే ఉన్నాను`` అంటూ స‌ల్మాన్ స‌ర‌దాగా సంభాషించారు. రెండు దశాబ్దాలకు పైగా నో-కిస్సింగ్ విధానాన్ని అనుసరిస్తున్న సుల్మాన్ ఈ రికార్డును బద్దలు కొట్టి దిశాను తెరపై ముద్దు పెట్టుకున్నారు. అదెట్టా..? అని ప్ర‌శ్నిస్తే.. సల్మాన్ ఇందులో ఒక ట్విస్ట్ ఉందని అన్నారు. నేను దిశాను పెదవులపై కాకుండా టేప్ మీద ముద్దుపెట్టుకున్నాను.. అంటూ క‌న్విన్స్ చేశారు.

మ‌రోవైపు స‌ల్మాన్ యూనిక్ అని అత‌డిలా డ్యాన్సులు వేరొక‌రు చేయ‌లేర‌ని చాలా సునాయాసంగా అప్ర‌య‌త్నంగా చేసేస్తార‌ని కితాబిచ్చేసింది దిశాప‌టానీ.