Begin typing your search above and press return to search.
సక్సెస్ మీట్ కోసం స్పాన్సర్స్ ను వెతుకుతున్నారట!
By: Tupaki Desk | 9 Feb 2020 2:30 PM GMTసంక్రాంతి సినిమాల హంగామా ఏమాత్రం ఆగేలా లేదు. ఎందుకంటే ఇప్పటికే సంక్రాంతి సినిమాల పోటీ ఎంత దూరం పోయిందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. కలెక్షన్స్ రచ్చ కూడా కొత్త పుంతలు తొక్కింది. ఈ లెక్కలన్నీ ఐటీ వారు కనుక దర్శక నిర్మాతలు.. హీరోల ముందు పెట్టి "భలే భలే బ్లాక్ బస్టర్ కలెక్షన్లు. మరి టాక్సుల సంగతేంటి బాబులు..?" అని ప్రశ్నిస్తే అప్పుడు కానీ అసలు సంగతి బయటపడదు.
సరే ఇది ఐటీ వారు చూసుకోవాల్సిన పని. మనదేశంలో చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుందని ఏ చిన్న పిల్లాడినడిగినా చటుక్కున చెప్తాడు. నిజమే.. ఐటీవారు కూడా తమపని తాము చేసుకుంటారు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతి సినిమాల్లో ఒక సినిమాకు సంబంధించిన విజయోత్సవం విజయవాడలో మార్చి 1 న భారీ స్థాయిలో జరపాలని ప్లాన్ చేస్తున్నారట. హీరోగారు స్వయంగా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ ఫోన్ చేసి ఈ ఫంక్షన్ కు ఆహ్వానిస్తారట. ఆ ఈవెంట్ కు ఈ డిస్ట్రిబ్యూటర్లు హాజరై.. వాళ్ల వాళ్ల ఏరియా రికార్డులను ఈ కార్యక్రమంలో స్వయంగా చెప్పాలట.
ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సక్సెస్ మీట్ కు డబ్బు ఖర్చుపెట్టడం ఈ సినిమా నిర్మాతలకు ఇష్టం లేకపోవడంతో ముందుకు రావడం లేదట. ఎవరైనా స్పాన్సర్స్ ను వెతికి వారికి ఈ బాధ్యత అప్పగించమని చెప్పారట. నిజానికి ప్రతి సినిమా ఈవెంటుకు స్పాన్సర్స్ ఉంటారు... వారు కొంత ఇస్తే నిర్మాతలు మరికొంత ఇవ్వాలి. కానీ నిర్మాతలు మాత్రం ఈసారి ఒక్కరూపాయ కూడా ఖర్చుపెట్టేందుకు సిద్దంగా లేరట. ఈమధ్య మరో హీరో సినిమాకు థ్యాంక్స్ మీట్ జరిగితే ఆ సినిమాకు ఈ స్పాన్సర్స్ ఫార్ములా ను విచ్చలవిడిగా వాడుకున్నారట. ఈ సినిమా హీరోకు ఈ కిటుకు కొత్తగా తెలిసిందే అని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.