Begin typing your search above and press return to search.
ఫ్యామిలీని దుబాయ్ కి షిఫ్ట్ చేస్తున్న స్టార్ హీరో
By: Tupaki Desk | 15 Jun 2021 2:30 AM GMTప్రస్తుతం ఇండియా సేఫా? దుబాయ్ సేఫా? అంటే కచ్ఛితంగా దుబాయ్ అని చెబుతారు. 80 శాతం వ్యాక్సినేషన్ అత్యుత్తమ జాగ్రత్తలతో దుబాయ్ లాంటి చోట్ల ప్రజలు సురక్షితంగా ఉన్నారు. ఇండియాలో ఇంకా 130 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఎప్పటికి అవుతుంది అన్నది ఫజిల్. అందుకే బాలీవుడ్ స్టార్ హీరో నవాజుద్దీన్ సిద్దిఖీ పిల్లలు - షోరా .. యాని దుబాయ్ కి షిఫ్టవుతున్నారు.
ఇక్కడైతే చదువులు సున్నా. కానీ దుబాయ్ లో అలా కాదు .. అందుకే వారి పుస్తకాల సంచులను ప్యాక్ చేస్తున్నారు. వీరిద్దరూ తమ తల్లి ఆలియాతో కలిసి దుబాయ్ బయలుదేరనున్నారు. అక్కడ కుటుంబమంతా ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారు. షోరా (కుమార్తె) .. యాని (కొడుకు) ఆన్ లైన్ లో అధ్యయనాలను ఆస్వాధించరు. తరగతి గదులకు హాజరు కావాలని కోరుకుంటారు. ఇది భారతదేశంలో సమీప భవిష్యత్తులో అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదు.
ఆన్ లైన్ క్లాసులు నిజమైన తరగతి గది వలె ఉత్తమ విద్యను ఇవ్వవు. వచ్చే నెలలో పిల్లలు నాతో బయలుదేరతారు అని నవాజుద్దీన్ సతీమణి వెల్లడించారు. నవాజ్ - ఆలియా సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే దుబాయ్ లో పిల్లల స్కూల్ ప్రవేశాలను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. అన్ని ఫార్మాలిటీలు పూర్తయ్యాయి. అక్కడ నా మేనకోడలు ఉన్నారు. నాకు చాలా మంచి కేర్ టేకర్ ఉన్నారు. కాబట్టి నేను ఏదైనా పని కోసం లేదా నవాజ్ ను కలవడానికి భారతదేశానికి వచ్చినా అది సమస్య కాదు అని ఆమె తెలిపారు.
కోవిడ్ ఇప్పట్లో పోయేట్టు లేదు. అది ఎలా సాగుతుందో చూద్దాం. అంతేకాకుండా నా పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నాము. కాబట్టి వారు ఆనందించేంతవరకు మేము వారిని దుబాయ్ లో ఉంచుతాము అని తెలిపారు. నవాజుద్దీన్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ నటుడు. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. అతడు దుబాయ్ టు ఇండియా ప్రయాణిస్తారు.