Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో కొడుకు ఎంట్రీ.. మూడేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుండే చర్చలు

By:  Tupaki Desk   |   27 April 2022 2:30 PM GMT
స్టార్‌ హీరో కొడుకు ఎంట్రీ.. మూడేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుండే చర్చలు
X
టాలీవుడ్ లో ఆమాటకు వస్తు సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది చాలా కామన్ విషయం. టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఉన్న స్టార్‌ హీరోల్లో 99 శాతం మంది స్టార్ కిడ్స్ అనడంలో సందేహం లేదు. కొత్తగా బయట నుండి వచ్చే వారు చిన్న సినిమాలకు పరిమితం అవుతున్నారు. స్టార్‌ హీరోలుగా కేవలం స్టార్స్ కిడ్స్ మాత్రమే మారుతున్నారు. అయితే అందరు స్టార్ కిడ్స్ కూడా సక్సెస్ అవ్వడం లేదు.

స్టార్స్ పిల్లలు అయినా... సూపర్ స్టార్స్ వారసులు అయినా కూడా ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఎంత పెద్ద స్టార్‌ అయినా కూడా తమ వారసుడిని ఇండస్ట్రీలో స్టార్‌ గా నిలపవడం అంత సులభమైన విషయం కాదు. ప్రతిభ తో పాటు అదృష్టం కూడా కలిసి వస్తేనే స్టార్‌ కిడ్స్ వండర్ కిడ్స్ గా మారి సూపర్‌ హిట్స్ ను దక్కించుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ రవితేజ కొడుకు ఇండస్ట్రీ లో అడుగు పెట్టబోతున్నాడు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా సహాయ దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రవితేజ హీరోగా అనూహ్యంగా స్టార్ డమ్‌ ను దక్కించుకున్నాడు. స్టార్‌ గా ఆయన ఎన్నో సూపర్‌ హిట్స్ ను దక్కించుకున్నాడు. ఇప్పటికి కూడా రవితేజ స్టార్‌ హీరోల జాబితాలోనే ఉన్నాడు. ఆయన తనయుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడని తెలుస్తోంది.

హీరోగా మహాధన్‌ ఎంట్రీకి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. కాని ఇప్పటి నుండే అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే బాల నటుడిగా మహాధన్ రాజా ది గ్రేట్‌ సినిమాలో నటించి మెప్పించాడు. ఇప్పుడు హీరోగా నటించేందుకు తర్ఫీదు తీసుకుంటున్నాడు. నటన.. డాన్స్.. మరియు మార్షల్ ఆర్ట్స్ ల్లో ట్రైనింగ్‌ తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మహాధన్‌ చూడ్డానికి బాలీవుడ్‌ హీరో మాదిరిగా క్యూట్‌ గా చాక్లెట్‌ బాయ్ గా ఉంటాడు. ఈ మద్య కాలంలో మహాధన్ మరింతగా ఆకర్షణీయంగా మారాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. అందుకే ఆయన్ను హీరోగా పరిచయం చేయాలని రవితేజ సన్నిహితుల నుండి ఒత్తిడి వస్తుందట. మహాధన్‌ కు కూడా ఇండస్ట్రీపై ఆసక్తి ఉంది. అందుకే ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.

మరో మూడు సంవత్సరాలకు గాను మహాధన్‌ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయినా కూడా ఇప్పటి నుండే ఏర్పాట్లు జరుగుతున్నాయట. అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహాధన్ సినిమా మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనీల్‌ రావిపూడి మాత్రమే కాకుండా హరీష్ శంకర్‌ కూడా మహాధన్ తో సినిమాను చేసేందుకు కథను సిద్దం చేస్తున్నాడట. 2025 లో మహాధన్ మొదటి సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.