Begin typing your search above and press return to search.

సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ తో సాంగ్ పాడించిన స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   27 April 2021 12:30 PM GMT
సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ తో సాంగ్ పాడించిన స్టార్ హీరో..!
X
బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ - రొమేనియన్‌ బ్యూటీ లూలియా వంటూర్‌ మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని బీటౌన్ వర్గాలు ఎప్పటి నుంచో కోడై కూస్తున్నాయి. మోడల్ కమ్ ప్లేబ్యాక్ సింగర్ అయిన లూలియా అప్పుడప్పుడు సల్మాన్ ఫామ్‌ హౌస్‌ లో దర్శనమిస్తుండటం.. బర్త్ డే లకి స్పెషల్ బహుమతులు ఇచ్చుకోవడం.. కరోనా లాక్ డౌన్ లో కలిసి ఉండటం చూసి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అందరూ ఫిక్స్ అయ్యారు. ఒకానొక సమయంలో సల్లూ భాయ్ లులియా ని పెళ్ళి కూడా చేసేసుకున్నాడని వార్తలు వచ్చాయి. ఇది రూమర్ అయినప్పటికీ, సల్మాన్ - లూలియా రిలేషన్ షిప్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది.

ఈ నేపథ్యంలో లూలియా వంటూర్‌ తాజాగా ఆయన నటించిన సినిమాలో ఓ సాంగ్ పాడటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ హీరోగా నటించిన సినిమా ''రాధే''. ఈ సినిమా కోసం రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ 'డీజే' చిత్రంలోని 'సీటీమార్' పాటను రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. నార్త్ ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తున్న ఈ సాంగ్ తెలుగు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. హిందీ 'సీటీమార్' పాటను కమాల్ ఖాన్ తో కలిసి సల్మాన్ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ అనే ముద్ర పడిపోయిన లూలియా వంటూర్‌ ఆలపించారు. ఇంతకముందు 'రేస్‌ 3' సినిమా కోసం సల్మాన్‌ రాసిన ‘సెల్ఫిష్‌’ సాంగ్‌ కూడా లూలియా పాడారు. భాయ్ మనసు దోచేసింది కాబట్టే ఇలా రొమేనియన్ బ్యూటీని సల్మాన్ ఎంకరేజ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.