Begin typing your search above and press return to search.

కొడుకు కోసం స్టార్ హీరో తిప్పలు

By:  Tupaki Desk   |   15 Jun 2019 6:26 AM GMT
కొడుకు కోసం స్టార్ హీరో తిప్పలు
X
అపరిచితుడు సినిమా ద్వారా తెలుగులోనూ భీభత్సమైన మార్కెట్ సంపాదించుకున్న చియాన్ విక్రంకు టాలీవుడ్ లో ఇప్పుడు మునుపటి వైభవం లేదు. మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. గత కొన్నేళ్ళలో ఏకంగా డబ్బింగ్ కాని విక్రం సినిమాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు. అందుకే అతని కొత్త ప్రాజెక్టుల మీద ఇక్కడ ఏ మాత్రం ఆసక్తి కనిపించడం లేదు. ఇంత జరిగినా యాక్టింగ్ పరంగా విక్రంను అభిమానించే ప్రేక్షకులు చాలా ఉన్నారు.

తమిళ్ లో ప్రస్తుతం మహావీర్ కర్ణన్ చేస్తున్న విక్రం మొదటిసారి కెరీర్ లో మూడు వందల కోట్ల బడ్జెట్ మూవీలో నటిస్తున్నాడంటూ చెన్నై మీడియా ఓ రేంజ్ లో కథనాలు రాసింది. ప్రస్తుతం ఇది హోల్డ్ లో ఉన్నట్టు సమాచారం. దర్శకుడు ఆర్ ఎస్ విమల్ నిర్మాత ఇద్దరూ సిద్ధంగా ఉన్నప్పటికీ కొద్ది రోజులు బ్రేక్ వేయమని కోరాడట. దానికి కారణం త్వరలో తన వారసుడు నటించిన ఆదిత్య వర్మ విడుదల కాబోతుండటమే. ఇప్పటికే బాలా తీసిన ఓ వెర్షన్ ను చెత్తబుట్టలో పారేసి గిరిసాయతో ఇంకో వెర్షన్ రీ షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షూటింగ్ అయిపోయింది.

విక్రం దగ్గరుండి అంత తానే చూసుకుంటున్నాడట. టీజర్ తో మొదలుకుని ప్రీ రిలీజ్ ప్రమోషన్ దాకా మొత్తం తన కనుసన్నల్లో జరిగేలా ప్లాన్ చేసుకున్నాడని టాక్. కాబట్టి మహావీర్ కర్ణన్ షూటింగ్ లో ఉంటే ఇది సాధ్యపడదు కాబట్టే అది హోల్డ్ లో పెట్టినట్టు వినికిడి. అయినా అంత రిస్క్ పెట్టి ఖర్చు పెడుతున్న నిర్మాతలను వెయిటింగ్ లో పెట్టి ఇలా కొడుకు కోసం తపనపడటం ఏమిటని విషయం ఉంటె సినిమా ఆడుతుందిగా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి రీమేక్ గా రూపొందిన ఆదిత్య వర్మ మీద చియాన్ అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అందుకే విక్రం ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవడానికి కారణం