Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో సూపర్‌ హిట్‌ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అలర్ట్‌

By:  Tupaki Desk   |   15 Dec 2021 6:30 AM GMT
స్టార్‌ హీరో సూపర్‌ హిట్‌ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అలర్ట్‌
X
తమిళ స్టార్‌ హీరో శింబు చాలా రోజుల తర్వాత 'మానాడు' సినిమా తో సక్సెస్ దక్కించుకున్నాడు. గత నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. తమిళనాట చాలా కాలం తర్వాత థియేటర్ల వద్ద సందడి వాతావరణం ఈ సినిమా తో కనిపించింది అంటూ తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరిగింది.

కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమాకు దాదాపుగా 90 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు అయినట్లుగా తమిళ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పొలిటికల్ క్రైమ్‌ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఇంకా థియేటర్‌ రన్‌ కొనసాగుతుంది. ఈ సమయంలోనే సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌ కు సిద్దం చేస్తున్నట్లుగా సోనీలివ్‌ ఓటీటీ సంస్థ ప్రకటించింది.

సోనీలివ్‌ వారు ఈమద్య కాలంలో సౌత్‌ లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకు హిందీ సినిమాలను మాత్రమే విడుదల చేస్తూ వచ్చిన సోనీలివ్ ఈమద్య కాలంలో తెలుగు మరియు తమిళంకు చెందిన పెద్ద చిన్న సినిమాలను స్ట్రీమింగ్‌ చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే తమిళంలో సూపర్ హిట్‌ అయిన ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేయడానికి సిద్దం అయ్యింది.

భారీ మొత్తానికి సోనీ వారు ఈ సినిమా రైట్స్ ను కొనుగోలు చేశారనే వార్తలు వస్తున్నాయి. సూపర్‌ హిట్‌ మానాడు సినిమా ను అతి త్వరలోనే సోనీ లివ్ లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

మానాడు సినిమాలో శింబు విభిన్నమైన పాత్రలో కనిపించాడు. ఇక ప్రముఖ దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమా లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శణ్‌ నటించింది. యాక్షన్‌ కమ్‌ పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కించాడు. సురేష్ కామాట్చి నిర్మించిన ఈ సినిమాకు సంగీతాన్ని యువన్‌ శంకర్ రాజా అందించాడు.

పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళ ఆడియన్స్ ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేయడం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సోని లివ్ లో వచ్చే శుక్రవారం అంటే డిసెంబర్ 24వ తారీకున స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. స్ట్రీమింగ్‌ కు సంబంధించిన అఫిషియల్ తేదీ రివీల్‌ అవ్వాల్సి ఉంది.