Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ ఫ్యాన్స్ ని నిరాశ‌ప‌రిచిన స్టార్ హీరో సూర్య‌

By:  Tupaki Desk   |   23 Oct 2020 3:15 AM GMT
మ‌ళ్లీ ఫ్యాన్స్ ని నిరాశ‌ప‌రిచిన స్టార్ హీరో సూర్య‌
X
వ‌రుస ఫ్లాపుల నుంచి బ‌య‌ట‌ప‌డాల‌న్న క‌సి ఓవైపు.. అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ తో విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌న్న పంతం మ‌రోవైపు.. ఇవ‌న్నీ నెర‌వేరేదెలా? సూర్య‌లో అంత‌ర్మ‌థ‌నానికి ఆకాశ‌మే హ‌ద్దుగా స‌మాధాన‌మిస్తుంద‌నే భావించారు అభిమానులు. కానీ అనుకున్న‌దొక్క‌టి అయినదొక్క‌టి! అన్న చందంగా ఉంది ప‌రిస్థితి. ఊహించిన విధంగా మ‌హ‌మ్మారీ విరుచుకుప‌డ‌డంతో ప్లాన్ మొత్తం రివర్స‌య్యింది.

స్టార్ హీరో సూర్య తా‌ను స్వ‌యంగా న‌టిస్తూ నిర్మించిన `ఆకాశ‌మే నీహ‌ద్దురా` రిలీజ్ డైల‌మా స‌ర్వ‌త్రా సందేహాన్ని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి గురు ఫేం సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళంలో `సూరరాయి పోట్రూ` పేరుతో రూపొందుతున్న‌ప ఈ చిత్రాన్ని తెలుగులో `ఆకాశ‌మే నీహ‌ద్దురా` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే థియేట్రిక‌ల్ రిలీజ్ కాకుండా ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ‌లో రిలీజ్ ‌కు రెడీ అయిన వి‌ష‌యం తెలిసిందే.

ఎయిర్ డెక్క‌న్ వ్యవస్థాపకుడు జి. ఆర్. గోపీనాథ్ జీవితం స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిన‌దే. ఈ నెల 30న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావాల్సి వుంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఆ రోజు రిలీజ్ చేయ‌డం లేద‌ని తెలిసింది. స్వ‌యంగా ఈ విష‌యాన్ని హీరో సూర్య వెల్ల‌డించారు. దీంతో చాలా రోజులుగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌వుతున్నారు. ఈ వాయిదాకు కార‌ణాన్ని వెల్ల‌డిస్తూ హీరో సూర్య‌ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక ప్రకటనను పంచుకున్నారు. దీని వెన‌కున్న కార‌ణాల‌ని వెల్ల‌డించారు.

జాతీయ భద్రతకు సంబంధించిన అంశంపై వివాదాల్ని ప‌రిష్క‌రించుకునే క్ర‌మంలోనే ఈ ఆల‌స్యం. నిజమైన భారతీయ ఎయిర్ ఫోర్స్ విమానాలు భద్రతతో వ్యవహరిస్తున్నాయ‌ని .. దేశ స‌మ‌గ్ర‌త‌కు భంగం క‌లిగించేదిగా సినిమాలో ఏదీ ఉండ‌ద‌ని సూర్య‌ అన్నారు. కొన్ని కొత్త ఎన్‌ఓసి (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు) ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామ‌ని ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి అని సూర్య స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని అభి‌మానులు పాజిటివ్ ‌గా తీసుకుంటార‌ని ఆశిస్తున్నానన్నారు.