Begin typing your search above and press return to search.
స్టార్ హీరో వర్సెస్ స్టార్ ప్రొడ్యూసర్!
By: Tupaki Desk | 27 Sep 2022 5:18 AM GMTనైజాంలో ఏ స్టార్ సినిమా రిలీజ్ చేయాలన్నా స్టార్ ప్రొడ్యూసర్ రిలీజ్ చేయాల్సిందే. కారణంగా నైజాంలో అత్యధికంగా మెయిన్ థియేటర్లు ఆయన చేతిలోనే వున్నాయి. దీంతో చాలా మంది స్టార్స్ తో సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్ లు నైజాం అనే సరికి స్టార్ ప్రొడ్యూసర్ కె అప్పగించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇదే ఇప్పడు సీనియర్ స్టార్ హీరో సినిమాకు ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై స్టార్ హీరో సదరు ప్రొడ్యూసర్ కమ్ నైజాం డిస్ట్రిబ్యూటర్ పై గుర్రుగా వున్నాడట.
వివరాల్లోకి వెళితే.. సీనియర్ స్టార్ హీరో నటించిన ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దసరాకు ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చక చకా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీకి నైజాం లో మరీ ప్రధానంగా హైదరాబాద్ సిటీలో మెయిన్ థియేటర్స్ లభించడం లేదని, దీనికి నైజాం స్టార్ ప్రొడ్యూసర్, అతని సోదరుడు ప్రధాన కారణమని తెలుస్తోంది.
కారణం మందు సీనియర్ స్టార్ హీరో సినిమాని సదరు నైజాం డిస్ట్రిబ్యూటర్ కమ్ స్టార్ ప్రొడ్యూసర్ కే ఇవ్వాలని అనుకున్నారు. అయితే భారీ మొత్తాన్ని అందించే పార్టీ తొరకడంతో సదరు సీనియర్ స్టార్ హీరో సినిమాని వారికే మేకర్స్ ఇచ్చేశారు. అయితే సినిమాని మాత్రం నైజాం డిస్ట్రిబ్యూసర్ అయిన స్టార్ ప్రొడ్యూసర్ ద్వారానే రిలీజ్ చేయాలని మాట తీసుకున్నారట. కానీ రైట్స్ తీసుకున్న సదరు సంస్థ మాత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్ లో పట్టున్న మరో సంస్థకు ఇచ్చేశారట.
ఇక్కడే అసలు కథ మొదలైంది. తనకు ఇస్తానన్న సినిమా మరో సంస్థకు ఇవ్వడం, వారు కాస్తా సినిమాని నైజాం లో మరో ఎగ్జిబిటర్ కు అప్పగించడంతో స్టార్ ప్రొడ్యూసర్, నైజాం డిస్ట్రిబ్యూటర్, అతని సోదరుడు సదరు సీనియర్ స్టార్ హీరో సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లని ఇవ్వడానికి ఇష్టపడటం లేదట.
ఇదే ఇప్పడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సదరు సీనియర్ హీరో తనయుడు, స్టార్ హీరో ఆరా తీస్తున్నారట. తన ఎంక్వైరీలో సదరు స్టార్ ప్రొడ్యూసర్, అతని సోదరుడే తమ సినిమాకు థియేటర్లకు ఇవ్వడం లేదన్న విషయం స్పష్టం కావడంతో స్టార్ హీరో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
సీనియర్ స్టార్ హీరో నటించిన తెలుగు సినిమాని పక్కన పెట్టి డబ్బింగ్ సినిమాకు భారీ స్థాయిలో మెయిన్ థియేటర్లని కేటాయించడం సదరు స్టార్ హీరోకు ఆగ్రహాన్ని తెప్పిస్తోందట. ఈ సమస్య ఏ మలుపు తీసుకుంటుందో అని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.