Begin typing your search above and press return to search.
మరోసారి పొలిటీషన్‌గా కనిపించబోతున్న స్టార్ హీరో
By: Tupaki Desk | 25 Sep 2020 1:30 PM GMTతమిళ స్టార్ హీరో సూర్య త్వరలో 'ఆకాశమే నీ హద్దురా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అయినా కరోనా లాక్ డౌన్ కారణంగా విడుదల ఆలస్యం అవుతుంది. థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయాలని అంతా భావించారు. కాని ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదంటూ యూనిట్ సభ్యులు ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత ఇప్పటికే పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సూర్య రెడీ అయ్యాడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది.
పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య చేయాల్సిన సినిమా నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో సూర్య పొలిటీషియన్ గా కనిపించబోతున్నాడట. సూర్య గత సినిమా ఎన్ జీ కే లో రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించాడు. ఆ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. సూర్య రాజకీయ నాయకుడిగా మరోసారి పాండిరాజ్ దర్శకత్వంలో కనిపించబోతున్నాడు. హీరోలు రాజకీయ నాయకులుగా నటించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. చాలా బలమైన కథ ఉంటేనే రాజకీయ నాయకుడిగా కనిపించేందుకు హీరోలు ఆసక్తి చూపిస్తారు. సూర్య కూడా పాండిరాజ్ కథ నచ్చడం వల్లే మరోసారి రాజకీయ నాయకుడిగా నటించేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది.