Begin typing your search above and press return to search.

10K రికార్డును సొంతం చేసుకున్న స్టార్‌ హీరో

By:  Tupaki Desk   |   3 Feb 2021 3:15 PM IST
10K రికార్డును సొంతం చేసుకున్న స్టార్‌ హీరో
X
తమిళ స్టార్‌ హీరో అజిత్ కు బైక్ లు అంటే పిచ్చి అభిమానం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వందల కిలోమీటర్లను అవలీలగా బైక్ పై ట్రావెల్ చేస్తూ ఉంటాడు. షూటింగ్‌ కోసం వందల కిలో మీటర్లు స్వయంగా బైక్‌ పై వెళ్లి హాజరు అవ్వడం ఆయనకు అలవాటే. హైదరాబాద్ చెన్నైల మద్య బైక్ జర్నీని అజిత్ ఎన్నో సార్లు చేశాడు. చాలా మంది స్టార్స్ కారు లేదా రైలు ప్రయాణంకు కూడా ఆసక్తి చూపించరు. కేవలం విమానంలో మాత్రమే వెళ్లాలనుకుంటారు. కాని అజిత్ మాత్రం సునాయాసంగా బైక్ పై రయ్‌ రయ్‌ మంటూ చక్కర్లు కొడుతూ ఉంటాడు. ఏ స్టార్ హీరో చేయని బైక్‌ రైడింగ్ లను అజిత్‌ చేసి రికార్డులు దక్కించుకున్నాడు. తాజాగా 10 వేల కిలో మీటర్ల రైడ్ ను పూర్తి చేసి అరుదైన రికార్డును అజిత్‌ దక్కించుకున్నాడు.

అజిత్ ఇటీవల చెన్నై - కోయంబత్తూర్‌ - చెన్నై - హైదరాబాద్ - వారణాసి - గాంగ్టక్ - లక్నో - అయోధ్య - హైదరాబాద్‌ - చెన్నై సింగిల్ ట్రిప్‌ లో కంప్లీట్‌ చేశాడు. మొత్తం పది వేల కిలో మీటర్లకు పైగా అజిత్ ఈ రైడ్‌ లో పూర్తి చేశాడంటూ ఆయన సన్నిహితులు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాడు. ఒక వైపు షూటింగ్‌ చేసుకుంటూ మరో వైపు ఇలా సరదాగా బైక్ రైడ్‌ చేస్తున్న హీరో అజిత్‌ ను చూసి అభిమానులు మరియు నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అజిత్‌ కు ఈ సరదా ఏంటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అజిత్ లా ఇంతలా బైక్ రైడ్‌ చేయగల సత్తా ఏ హీరోకు లేదంటూ ఆయన అభిమానులు గంటాపథంగా చెబుతున్నారు.