Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ ప‌నిలో హీరో వైఫ్ ఫింగ‌రింగ్

By:  Tupaki Desk   |   2 July 2019 1:30 AM GMT
డైరెక్ట‌ర్ ప‌నిలో హీరో వైఫ్ ఫింగ‌రింగ్
X
సినిమా 24 శాఖ‌ల్లో ద‌ర్శ‌క‌త్వం ఎంతో కీల‌క‌మైన శాఖ‌. క్రియేటివ్ పార్ట్ ని హ్యాండిల్ చేసే డైరెక్ట‌ర్ కి కెప్టెన్ హోదానిచ్చి గౌర‌విస్తారు. ద‌ర్శ‌కుడితో స‌మానంగా ఇన్వాల్వ్ అయ్యేది కేవ‌లం ర‌చ‌యిత‌- నిర్మాత‌- హీరో. క‌థ ద‌గ్గ‌ర నుంచి సన్నివేశాలు సహా క‌థాగ‌మ‌నం ఎలా ఉంటుంది? అన్న‌ది ద‌ర్శ‌కుడు ముందే నిర్మాత‌- హీరోల‌కు చెప్పి క‌న్విన్స్ చేసుకుంటాడు. ఒక‌సారి స్క్రిప్ట్ లాక్ అయ్యి సెట్స్ కెళ్లాక అన్ని బాధ్య‌త‌లు ద‌ర్శ‌కుడివే. అయితే సెట్స్ కెళ్లాక‌ కూడా ద‌ర్శ‌కుడి ప‌నిలో వేలు పెడితే దానిని ఫింగ‌రింగ్ అంటారు. ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర‌కూ ఇత‌రుల స‌ల‌హాల్ని సూచ‌న‌ల్ని ద‌ర్శ‌కుడు తీసుకోవ‌డం కామ‌న్. కానీ సెట్స్ కెళ్లాక కూడా స‌జెష‌న్స్ ఇస్తే అది టూమ‌చ్ కిందే లెక్క‌.

అయితే ఇండ‌స్ట్రీలో సెట్స్ కెళ్లాక కూడా వేలు పెట్టే త‌త్వం ఉన్న హీరోలున్నార‌ని ఇదివ‌ర‌కూ ప‌లు వివాదాలు తేల్చి చెప్పాయి. తాజాగా ఓ హీరో గారి భార్యామ‌ణి కూడా ఓ యంగ్ డైరెక్ట‌ర్ ప‌నిలో ఇన్వాల్వ్ అవ్వ‌డం గురించి ఆస‌క్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు. సినిమా అంటే త‌న‌కు ఎంతో ఫ్యాష‌న్. అందువ‌ల్ల ఉత్సాహంలో స‌ద‌రు హీరో గారి వైఫ్ సీన్స్ విష‌యంలోనూ ఇన్వాల్వ్ అయ్యార‌ట‌. అయితే అది ఇన్వాల్వ్ మెంట్ అనాలో లేక ఫింగ‌రింగ్ అనాలో తెలీని క‌న్ఫ్యూజ‌న్ స‌ద‌రు యంగ్ డైరెక్ట‌ర్ కి త‌ప్ప‌లేద‌ని తెలుస్తోంది. `వీళ్ల‌ను ఏడాది భ‌రించ‌గ‌ల‌ను` అనుకున్నాకే బ‌రిలో దిగాడ‌ట స‌ద‌రు యంగ్ డైరెక్ట‌ర్.

ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ఆమె ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందా? అని త‌న‌నే ప్ర‌శ్నిస్తే.. ``త‌న‌కు తోచిన ఐడియాను చెబుతారు. ఒక డైరెక్ట‌ర్ గా నీకు సెన్సిబుల్‌గా అనిపిస్తే ఓకే... లేకుంటే నో ప్రాబ్ల‌మ్!! అని చొర‌వ తీసుకుంటారు. కావాల్సినంత‌ ఫ్రీడ‌మ్ ఇస్తార‌ని పాజిటివ్ యాంగిల్ ని చెప్పారు. నాకు ఎవ‌రు మంచి ఐడియా చెప్పినా ఓకే చేస్తాను... వాళ్ల‌కు క్రెడిట్ కూడా ఇస్తాను`` అని యువ‌ద‌ర్శ‌కుడు చెప్పారు. మొత్తానికి స‌ద‌రు హీరోగారి భార్యామ‌ణి ఫింగ‌రింగ్ చేసినా ద‌ర్శ‌కుడికి స్వేచ్ఛ‌నిస్తున్నారు కాబ‌ట్టి ఫ‌ర్వాలేదు. అలా కాకుండా నేను ప‌ట్టిన కుందేటికి మూడే కాళ్లు! అన్నారంటేనే చిక్కు. ఇటీవ‌ల స‌ద‌రు స్టార్ వైఫ్ త‌మ హీరో సినిమాల బాధ్య‌త‌ల‌న్నీ త‌నే చూస్తున్నారు. అవ‌స‌రం మేర అన్ని శాఖ‌ల్ని.. బిజినెస్ వ్య‌వ‌హారాల్ని స‌మ‌న్వ‌యం చేస్తున్నారు. ద‌ర్శకుల‌తోనూ సీన్స్ విష‌యంలో ఐడియాలిస్తూ ఆల్ రౌండ‌ర్ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్నారు. అయితే ద‌ర్శ‌కులు మాత్రం త‌మ‌కు న‌చ్చిన‌వాటిని ఉప‌యోగించుకుని మిగ‌తావి లైట్ తీస్కోవ‌డం కొస‌మెరుపు. ఆ మాత్రం వెసులుబాటు ఉంటే మంచిదేగా!!!.. అంతేగా!!