Begin typing your search above and press return to search.

'మా' ఎన్నికల్లో ఓటు వేయని స్టార్ హీరోలు వీరే?

By:  Tupaki Desk   |   10 Oct 2021 10:04 AM GMT
మా ఎన్నికల్లో ఓటు వేయని స్టార్ హీరోలు వీరే?
X
గతంలో ఎన్నడూ లేనట్టుగా 'మా' ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ లోని పబ్లిక్ స్కూల్ లో ప్రారంభమైన ఈ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి.  మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ హోరాహోరీగా తలపడుతున్నాయి. రాజకీయ ఎన్నికల సమయంలో గొడవలు జరిగినట్టుగా మా ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రకాష్ రాజ్-నరేశ్, మోహన్ బాబు-బెనర్జీ, సమీర్ లు గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దాదాపు కొట్టుకోవడానికి రెడీ అయ్యారు.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పోలింగ్ ప్రారంభం కాగానే ముందుగా పవన్ తర్వాత వరుసగా చిరంజీవి, రాంచరణ్, బాలక్రిష్ణ, నాగార్జున, అలీ, బ్రహ్మానందం, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

'మా' ఎన్నికల చరిత్రలోనే తొలిసారి సరికొత్త రికార్డు నమోదైంది. గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఓటింగ్ శాతం ఈసారి ఎక్కువగా నమోదైంది.  మధ్యాహ్నం  2 గంటల వరకూ సుమారు 545 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. గత మూడు పర్యాయాలుగా 'మా' ఎన్నికలు పోటీపోటీగా సాగుతున్నాయి. గత మూడు సార్లు ఎవరూ ఓటు వేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొనగా ఈసారి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ల గట్టి ప్రయత్నాలతో సినీ ప్రముఖ నటులు  ఓటు హక్కు వినియోగించుకున్నారు. 'మా' మొత్తం 883మందికి ఓటు హక్కు ఉండగా.. ఇప్పటివరకు 545మంది ఓట్లు పడ్డాయి.క్యూలో 100 మంది వరకూ వేచి ఉండడంతో పోలింగ్ ను గంట పాటు పొడిగించారు.

పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు ముగిసింది. అయితే ఎంతో మంది చిన్న, పెద్ద నటులు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రాగా స్టార్ హీరోలు మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం గమనార్హం. ఇప్పటివరకు ఓటు వేసేందుకు స్టార్ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్, నాగచైతన్య, రానాలు రాలేదు. వీళ్లు ఇంత రచ్చ జరుగుతున్న ఎన్నికలను పట్టించుకోకుండా ఓటు వేసేందుకు రాకపోవడం విశేషం.