Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ డైరెక్టర్ వెనక పడుతున్న స్టార్ హీరోలు.. ఎందుకోసం..??
By: Tupaki Desk | 18 Aug 2020 2:30 AM GMT‘కేజిఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొత్త సినిమా చేయబోతున్నట్లు.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అదే ట్వీట్లో ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేయడంతో.. ఎన్టీఆర్ అభిమానుల్లో ఓ కొత్త కేజీఎఫ్ రక్తం ఉరకలు వేసిందని చెప్పాలి. ఎన్టీఆర్ 31వ సినిమా ఇదే అని చర్చ మొదలైంది. ‘‘మొత్తానికి అణు కర్మాగారం (నూక్లియర్ ప్లాంట్) పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. నెక్ట్స్ టైమ్ ఎన్టీఆర్ క్రేజీ ఎనర్జీ చుట్టూ నా రేడియేషన్ సూట్‌ను తీసుకొస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు సోదర! త్వరలోనే కలుద్దాం’’ అని తన ట్వీట్లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలిపాడు. ఎన్టీఆర్‌ను నూక్లియర్ పవర్ ప్లాంట్‌తో పోల్చడంతో అభిమానులు హల్చల్ చేశారు. ఇక ఎన్టీఆర్‌తో సినిమా కోసం ప్రశాంత్ నీల్‌కు రూ.2 కోట్ల భారీ అడ్వాన్స్‌గా చెల్లించారని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. 2022లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ప్రశాంత్ అలా ట్వీట్ చేసాడో లేదో.. కన్నడ ఇండస్ట్రీలో వ్యతిరేక నినాదాలు మొదలయ్యాయి. మన కన్నడ హీరోతో సినిమా చేయకుండా.. తెలుగు హీరోతో చేస్తావా అంటూ ప్రశ్నలు వెల్లువెత్తాయి. కేజీఎఫ్ సినిమాతో ఆకాశానికి లేపిన ప్రేక్షకులే అప్పుడే పాతాళానికి తొక్కేయడానికి ట్వీట్ల వర్షం కురిపించారు. రాజమౌళి, శంకర్ లాంటి వాళ్లే వాళ్ల హీరోలతో తప్ప బయట హీరోలతో చెయ్యట్లేదు. అలాంటిది నువ్ ఎలా ఎన్టీఆర్ తో తీస్తావ్.. అని ప్రశ్నించారు. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వెంటనే.. నేను కన్నడ సినిమాలే చేస్తాను.. నాకు ఈ ఇండస్ట్రీ లైఫ్ ఇచ్చింది అని చెప్పేసాడు. అయితే ప్రస్తుతం కేజీఎఫ్-2 షూటింగులో బిజీ ఉన్నాడు. ఇక స్టార్ తెలుగు హీరోలు ఎన్టీఆర్, ప్రభాస్ ఇద్దరు కూడా ప్రశాంత్ వెనక పడుతున్నారని టాక్. ఆయనేమో కన్నడ సినిమాలే చేస్తానని చెప్పాడు. మరి కేజీఎఫ్-2 సక్సెస్ మీదనే ప్రశాంత్ నెక్స్ట్ హీరో ఎవరనేది తెలియదు. ఇంతలో ఒక వైపు మా హీరోతోనే సినిమా చేస్తాడని పుకార్లు లేపుతున్నారు. అంత క్లారిటీగా చెప్పాక కూడా ఎందుకు హడావిడి చేస్తున్నారని సినీవర్గాలు అంటున్నాయి. కేజీఎఫ్ అయిపోయాక కూడా ప్రశాంత్ కన్నడ సినిమాలే చేస్తాడు.. మరి తెలుగు హీరోలను తీసుకుంటాడో లేదో తెలియాల్సి ఉంది.