Begin typing your search above and press return to search.

స్టార్ల సందడంతా సిటీలోనే

By:  Tupaki Desk   |   8 July 2019 7:51 AM GMT
స్టార్ల సందడంతా సిటీలోనే
X
మన టాలీవుడ్ తారలంతా అధిక శాతం ఈ సీజన్ లో అవుట్ డోర్ లో కాకుండా సిటీతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లోనే ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదంతా కాకతాళీయమే కావొచ్చు కానీ ఒకేసారి అందరూ అందుబాటులో ఉండటం మాత్రం అరుదుగా జరుగుతుంది. విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వికారాబాద్ లో వెంకీ మామ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కీలక భాగం పూర్తి చేసుకున్న ఈ మూవీలో మొదటిసారి నాగ చైతన్య మావయ్య తో ఫుల్ లెన్త్ రోల్ లో చేస్తుండటంతో అంచనాలు మాములుగా లేవు. సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు కానీ ఇంకో నెల వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్టు టాక్.

ఇక వరుణ్ తేజ్ వాల్మీకి అనంతపూర్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాక ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ చేస్తున్న డిస్కో రాజా నగర శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్నాడు. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీదే చాలా నమ్మకం పెట్టుకున్నాడు రవితేజ.

మణికొండ డాలర్ అవర్స్ లో నాగశౌర్య అశ్వద్ధామ షూటింగ్ జరుగుతోంది. ఇది కూడా వేగంగా సాగుతున్న షెడ్యూలే. ఆర్ఆర్ఆర్ కు రాజమౌళి అమెరికా వెళ్లిన కారణంగా బ్రేక్ ఇచ్చారు. వచ్చాక ఇక్కడ కంటిన్యూ అవుతుందా లేక నేరుగా అహ్మదాబాద్ వెళ్తారా ఇంకా తెలియలేదు. చరణ్ తారక్ ఇద్దరూ సిటీలోనే ఉన్నారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ షూటింగ్ లో సాయి తేజ్ ప్రతిరోజు పండగే షూట్ కోసం లోకల్ లోనే ఉన్నారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు కోసం కాశ్మీర్ వెళ్ళాడు. ఒకరు ఇద్దరు మినహాయిస్తే కీలకమైన స్టార్లందరూ భాగ్యనగరంలోనే ఉన్నారు.