Begin typing your search above and press return to search.
ఆ విషయంలో తగ్గకుంటే స్టార్స్ కు సైతం సినిమాలు ఉండవు
By: Tupaki Desk | 4 May 2020 12:30 AM GMTఇండియాలో అత్యధికంగా సినిమాలను నిర్మించే ఇండస్ట్రీల్లో టాలీవుడ్ ఒకటి. తెలుగు సినిమాలకు అత్యధిక మార్కెట్ ఉంది. ఈమద్య కాలంలో ఉత్తరాదిన కూడా తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. దాంతో పాన్ ఇండియా సినిమాలపై పలువురు తెలుగు స్టార్స్ దృష్టి పెట్టారు. ఇదే సమయంలో బాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాల బడ్జెట్ ఉంటుంది. స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ రికవరీ అవ్వాలంటే సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఒక్కోసారి హిట్ టాక్ వచ్చినా పెట్టుబడి రాని పరిస్థితి ఉంది. బడ్జెట్ ఆ స్థాయిలో పెరిగి పోయింది.
కరోనా కారణంగా అంతా మారిపోయింది. తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు ఎక్కువ శాతం ఇతరత్రా వ్యాపారాలు చేసుకునే వారే. నిర్మాతలకు ఫైనాన్స్ చేసే వారు కూడా ఇతరు వ్యాపారాలు చేసుకునే వారే. ఇది అది అని కాకుండా అన్ని వ్యాపారాలు లాక్ డౌన్ కారణంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో సినిమాల నిర్మాణం సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది. ఇక స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ లు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. హీరోలు మునుపటి మాదిరిగా నిర్మాతలను ఒత్తిడి చేసి పారితోషికం డిమాండ్ చేస్తే సినిమా నిర్మాణాలే జరిగే అవకాశం లేదు.
హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకుంటే తప్ప వారితో సినిమాలను నిర్మించేందుకు నిర్మాతలు ధైర్యం చేస్తారు. అది కూడా బడ్జెట్ విషయంలో కండీషన్స్ పెట్టకుండా.. హంగు ఆర్బాటాలకు పోకుండా ఉంటేనే సినిమాలు నిర్మిస్తామంటూ నిర్మాతలు ముందే చెప్పే అవకాశాలున్నాయి. హీరోలు రాబోయే రెండేళ్ల పాటు పారితోషికం విషయంలో రాజీ పడకుంటే వారు సినిమాలు చేయడమే కష్టం అవ్వనుంది. మరి హీరోలు పారితోషికాలు తగ్గించుకుంటారా లేదంటే మరేదైనా మార్గంలో ఆదాయంకు ప్రయత్నాలు చేస్తారా చూడాలి.