Begin typing your search above and press return to search.

ఇక నుంచి భవిష్యత్‌ ఇలాంటి స్టార్లదే

By:  Tupaki Desk   |   23 May 2015 7:30 PM GMT
ఇక నుంచి భవిష్యత్‌ ఇలాంటి స్టార్లదే
X
మన హీరోల్లో రొటీన్‌ హీరోలే ఎక్కువ. ఫైటింగులు, డ్యాన్సింగులు అదరొట్టేస్తూ నాలుగైదు ఎక్స్‌ప్రెషన్లకే పరిమితమయ్యే సోకాల్డ్‌ స్టార్లే మనకు ఎక్కువ. ఎప్పుడూ విలక్షణత, వైవిధ్యం, ప్రయోగం, ప్రయత్నం అనేవి వీళ్లలో కనిపించవు. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా రొటీన్‌ ఎక్స్‌ప్రెషన్‌తోనే కనిపిస్తున్నారు. దీనికి కారణం మన రచయితలు రాసే రొటీన్‌ కథలు కూడా కొంత కారణం.

అవే ఎన్నారై కథలు, అవే సినిమాలు తప్ప వేరే ప్రయోగాలేవీ చేయడం లేదు. ఎక్కువ జోనర్‌లను కూడా టచ్‌ చేసే ప్రయత్నమే లేదు. ఇటీవలి కాలంలో హారర్‌ జోనర్‌ ఊపందుకోవడంతో ఇందులో దెయ్యం ఆహార్యంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు నటీనటులు. అయితే నవతరం నటీనటుల్లో ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కోకుండా కొత్తగా ప్రయత్నిస్తే ఇప్పుడున్న స్టార్లను డామినేట్‌ చేసే ఛాన్సుంటుంది. కథల్లో ఒదిగిపోయి పాత్రల్లో వైవిధ్యాన్ని చూపించగలిగితే, ఆహార్యంలో, నటనలో కొత్తదనాన్ని కనిపెట్టగలిగితే ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది.

కోలీవుడ్‌లో సూర్య, విక్రమ్‌ లాంటి నటులు ఇలాంటి ప్రయోగాలకు తెగబడుతుంటారు. కమల్‌హాసన్‌ తర్వాత ఈ ఇద్దరే అంత విలక్షణమైన సినిమాలు చేస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ఇద్దరి కెరీర్‌ని పరిశీలిస్తే మిగతా హీరోలతో పోలిస్తే ప్రయోగాలు చాలా ఎక్కువ. వాటితోనే వాళ్లకు పేరు కూడా వచ్చింది. అలా కాకుండా ఇప్పుడొచ్చే నటీనటుల్లో రొటీన్‌గా కనిపిస్తే ముందు ముందు చూసేవాళ్లే ఉండరు.

ప్రస్తుతం ఉన్న స్టార్‌ హీరోలు సైతం జోనర్‌లు మార్చి ముఖ కవళికలు మార్చకపోతే మునుముందు జనాలకు, చివరికి అభిమానులకు సైతం మొహం మొత్తేయడం ఖాయం. బీకేర్‌ఫుల్‌!