Begin typing your search above and press return to search.

మహానటి కష్టపడుతుంటే వాళ్లంతా ఏం చేశారో?

By:  Tupaki Desk   |   11 May 2018 12:09 PM IST
మహానటి కష్టపడుతుంటే వాళ్లంతా ఏం చేశారో?
X
మహానటి మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో నటీనటులు కాకుండా ఆయా పాత్రలు మాత్రమే అందరికీ కనిపించాయి. సావిత్రి జీవితంలో జనాలకు తెలియని కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇవి కొంతమందికి గతంలోనే తెలిసినా.. ఇప్పుడు సినిమా ద్వారా మరింతగా అప్పటి పరిస్థితులు చేరువ అయ్యాయి.

జీవిత చరమాంకంలో ఆ మహానటి పడిన కష్టాలు వర్ణనాతీతం. వాటిని చూపిన తీరు.. కీర్తి సురేష్ అభినయం.. సమంత నెరేషన్ అన్నీ బాగున్నాయి. కానీ సావిత్రి లాంటి దిగ్గజ నటీమణి కష్టాలు పడుతుంటే.. తెరపై చూస్తున్న ప్రేక్షకులకే గుండె తరుక్కుపోయింది. అనేక మంది ఆడియన్స్ అయితే.. థియేటర్లలోనే ఏడ్చేస్తున్నారు. పైకి ఏడవలేని వాళ్లు కన్నీరును ఉగ్గబట్టుకుంటున్నారు. అయితే.. సావిత్రి అంతటి కష్టాలు పడుతుంటే ఇండస్ట్రీ జనాలు ఏం చేస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు చాలామందిని వేధిస్తోంది.

ఆమెతో నటించిన పలువురు దిగ్గజ నటులు.. సావిత్రి చరమాంకంలో ఉన్నపుడు ఫామ్ లోనే ఉన్నారు. వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా సావిత్రికి సాయం చేయకపోవడానికి ముందుకు రాకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. పెద్ద హీరోలు అనే పేరు గుర్తింపు మాత్రమే ఉంటే సరిపోదు.. కాసింత పెద్ద మనసు కూడా చేసుకుని ఉంటే.. అంతటి మహానటి తన చివరి కాలంలో అన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉండేది కాదు అనుకుంటున్నారు జనాలు.