Begin typing your search above and press return to search.
భయపడక బరిలో దూకేందుకు స్టార్ హీరోల డేర్ డెసిషన్
By: Tupaki Desk | 23 Aug 2020 11:30 PM GMTమహమ్మారీతో సహజీవనం చేస్తూనే అన్ని పనులు కానిచ్చేయాలని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలిగా ప్రకటించడం ఆ తర్వాత దానినే దేశమంతటా పాటించడం తెలిసిందే. ఇప్పుడు అదే సూత్రం టాలీవుడ్ కి అన్వయించాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు వేచి చూసిన మన స్టార్ హీరోలు ఇప్పుడు అన్ని జాగ్రత్తల్ని అనుసరిస్తూ షూటింగులు చేయాలని నిర్ణయించుకుంటున్నారు. కరోనా కు భయపడితే అసలుకే మోసం వస్తుందని భావించి ఇకపై బరిలో దూకేందుకే నిర్ణయించుకున్నారట.
ఇప్పటికే లాక్ డౌన్ పీరియడ్ లో మెగాస్టార్ చిరంజీవి.. వెంకటేష్ .. నాగార్జున .. బాలకృష్ణ సహా పలువురు అగ్ర కథానాయకులు రకరకాల స్క్రిప్టుల్ని ఫైనల్ చేసారు. తమిళ చిత్రం వీరం.. మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫర్ ల రీమేక్ ల కోసం చిరంజీవి చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది ఆచార్యతో కలిసి పూర్తి అవుతాయని భావిస్తున్నారు. వీటిలో ఒకటి ఆచార్యతో పాటు ఒకేసారి ప్రారంభించవచ్చు. విక్టరీ వెంకటేష్ నారప్పను పూర్తి చేయాల్సి ఉంది. అతను ఎఫ్ 3 కోసం తన అనుమతి ఇచ్చాడు. శేఖర్ కమ్ముల.. తరుణ్ భాస్కర్ లతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు.
బాలకృష్ణ -బోయపాటి సినిమా శరవేగంగా పూర్తి చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. నాగార్జున.. ప్రవీణ్ సత్తారుతో కలిసి పని చేస్తారు. తరువాత అతను రైడ్ రీమేక్ కోసం ప్లాన్ చేస్తున్నారు. రాజకీయాల్లో బిజీ అవ్వడానికి ముందు వచ్చే రెండేళ్లలో కనీసం ఐదారు ప్రాజెక్టులను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి చిత్రం షూటింగ్ ప్రారంభించే ముందు మహేష్ మంచి స్క్రిప్టు కోసమే వెయిటింగ్. అల్లు అర్జున్ `పుష్ప` చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేయనున్నారు. కొరటాలతో చిత్రం చేస్తాడు. ప్రభాస్ వరుసగా మూడు సినిమాల్ని పూర్తి చేయాల్సి ఉంది.
నాని 2021 చివరి నాటికి టక్ జగదీష్.. శ్యామ్ సింఘరాయ్ .. వివేక్ ఆత్రేయ చిత్రాలను పూర్తి చేస్తారు. శర్వానంద్ వరుస ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతున్నారు. నాగ చైతన్య వరుసగా విక్రమ్ కుమార్... మోహన కృష్ణ ఇంద్రగంటి.. నందిని రెడ్డిలతో చర్చలు సాగిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఫైటర్ తరవాత అనేక మంది చిత్రనిర్మాతలను వెయిటింగ్ లో ఉంచారు. రానా దగ్గుబాటి- సాయి తేజ్- నితిన్- వరుణ్ తేజ్- గోపీచంద్ తదితరులు బలమైన లైనప్ తో సన్నద్ధమవుతున్నారు.
బాలకృష్ణ.. రామ్ చరణ్.. రామ్ తదుపరి బిగ్ లైనప్ కోసం కసరత్తు చేయాల్సి ఉంది. టాలీవుడ్ నటులు చాలా మంది విరామం లేకుండా పనిచేయడానికి.. వరుస షెడ్యూల్స్ లో పూర్తి చేయడానికి కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించిన తర్వాత రాబోయే నెలల్లో జెట్ స్పీడ్ తో షూటింగులు చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు.