Begin typing your search above and press return to search.
న్యూ ఇయర్ లో టాలీవుడ్ స్టార్స్ జాతకాలు
By: Tupaki Desk | 8 April 2016 12:15 PM GMTకొత్త తెలుగు సంవత్సరం వచ్చేసింది. దుర్ముఖి నామ సంవత్సరం ఎంటర్ అయిపోయింది. జరిగిపోయిన ఏడాది చాలానే తీపి గుర్తులను ఇచ్చింది. మరి ఈ ఏడాది ఏ స్టార్ హీరోకి ఎలా ఉండనుందో!
కొత్త తెలుగు సంవత్సరాన్ని ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తన సర్దార్ గబ్బర్ సింగ్ తో స్టార్ట్ చేశాడు. ఇప్పటికే పవన్ తో సినిమా కోసం చాలా మంది క్యూలో ఉన్నా.. మహా అయితే పవన్ ఈ ఏడాది ఇంకో సినిమాని రిలీజ్ చేయచ్చు. అది కూడా అతి కష్టం మీదే అని చెప్పాలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం మే నెలలో రానుంది. మురుగదాస్ సహా మరికొందరు మహేష్ తో సినిమాకి ఉత్సాహం చూపుతున్నారు. ఇది కూడా దుర్ముఖి సంవత్సరంలోనే విడుదలయ్యే ఛాన్సులున్నాయి.
ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ బాహుబలి ది కంక్లూజన్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ 15న విడుదల చేస్తామని ఇప్పటికే చెప్పేశారు. అప్పటికి మరో తెలుగు ఏడాది కూడా వచ్చేస్తుంది. అంటే.. ఈ తెలుగు సంవత్సరంలో ప్రభాస్ సినిమా లేనట్లే.
గత మూడు నెలలుగా టాలీవుడ్ లో నాగార్జున జపం నడుస్తోంది. సోగ్గాడుగాను, ఊపిరిలో చేతులు కాళ్లు పడిపోయిన బిలియనీర్ పాత్రతోను ఆకట్టుకున్నారు. ఈ ఏడాది రాఘవేంద్రరావుతో వెంకటేశ్వర స్వామి భక్తుడు హథీరాం బాబా పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఈ ఏడాది బాలకృష్ణ వందో చిత్రం రూపు దిద్దుకోనుంది. ఇదే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. గౌతమీ పుత్ర శాతకర్ణిగా బాలయ్య చారిత్రక పాత్రలో చేయనున్నారు.
బాబు బంగారం అంటూ ప్రేక్షకుల ముందుకు జూలైలో వస్తున్నాడు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే పలు రీమేక్ కాన్సెప్టులు సిద్ధంగా ఉన్నాయి. బాబు బంగారం రిలీజ్ తర్వాత వీటిపై డెసిషన్ తీసుకుని, వేగంగా పూర్తి చేసే యోచనలో ఉన్నాడు వెంకీ.
రీసెంట్ గా నాన్నకు ప్రేమతో హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివతో చేస్తున్న జనతా గ్యారేజ్ ను ఈ ఏడాదే తెస్తున్నాడు. పూరీ జగన్నాథ్ - వక్కంతం వంశీ - హను రాఘవపూడి - వివి వినాయక్ లతో సినిమాలపై జూనియర్ కి కమిట్ మెంట్స్ ఉన్నాయి.
ఈ ఏడాది ధృవ అంటూ.. కోలీవుడ్ మూవీ తని ఒరువన్ రీమేక్ ను తెస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీంతో పాటే చిరంజీవి 150 చిత్రానికి నిర్మాణ బాధ్యతలు కూడా చేపడుతున్నాడు. అంటే రెండు డ్యూటీస్ తో ఈ ఏడాది చరణ్ బిజీ బిజీగా గడిపేస్తాడు.
సరైనోడు అంటో మరో రెండు వారాల్లోనే వచ్చేస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. దీని తర్వాత త్రివిక్రమ్ తో సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. విక్రమ్ కే కెమార్ తో కూడా ఓ మూవీ చేసేందుకు బన్నీ ఒప్పుకున్నాడు.
ఇక లాస్ట్... బట్ నాట్ లీస్ట్... అంటూ మెగాస్టార్ రీఎంట్రీ గురించి చెప్పుకోవాలి. కోలీవుడ్ మూవీ కత్తిని తెలుగులో రీమేక్ స్టార్ట్ చేయనున్న చిరంజీవి 'కత్తిలాంటోడు' టైటిల్ పై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఈ మెగాస్టార్ కత్తి ఈ ఏడాదే విడుదల అవుతుంది.