Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలు ఇక వాళ్లకి చెక్ పెట్టేస్తారా!?

By:  Tupaki Desk   |   21 Feb 2017 5:30 PM GMT
స్టార్ హీరోలు ఇక వాళ్లకి చెక్ పెట్టేస్తారా!?
X
ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఎంత కష్టమో.. అది థియేటర్లలోకి రావడం అంత కంటే పెద్ద కష్టం. మిగతా విషయాలు పక్కనపెడితే.. రిలీజ్ విషయంలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లది కీలక పాత్ర. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే.. స్టార్ హీరోలు ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నుంచి దూరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడు రైట్స్ తనకే ఇవ్వాలంటూ ఒక వ్యక్తి మీడియాకు ఎక్కాడు. సర్దార్ గబ్బర్ సింగ్ కి కృష్ణాజిల్లా రైట్స్ తీసుకుని 2 కోట్లు నష్టపోయాను కాబట్టి.. ఇప్పుడు కాంపెన్సేట్ చేయాలని.. దీనికి పవన్ సమాధానం చెప్పాలన్నది అతని డిమాండ్. గతంలో రజినీకాంత్ మూవీ కబాలి విషయంలో ఓ యంగ్ డిస్ట్రిబ్యూటర్ మీడియాకి ఎక్కి.. తనను పెద్ద డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నారని ఆరోపించాడు. అఫ్ కోర్స్.. తెలుగులో ఆ చిత్రం దాదాపు 10 కోట్ల వరకూ నష్టపరచడంతో మళ్లీ ఇతను ఎక్కడా కనిపించలేదు.

సినిమా రైట్స్ కొనేటపుడు క్రేజీ ఆఫర్స్ తో వచ్చి దక్కించుకోవడం.. సాధారణం అయిపోయింది. లాభాలు వస్తే మాత్రం ఎవరూ మాట్లాడరు కానీ.. తీరా నష్టాలు వస్తే మాత్రం ఇలా మీడియాకు ఎక్కుతుండడంతో.. చాలా మంది స్టార్ హీరోలు సొంత డిస్ట్రిబ్యూషన్ పై కన్నేశారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఒకటీ అరా వ్యక్తులే అయినా.. డిస్ట్రిబ్యూటర్లు ఇలా మీడియాకి ఎక్కడంతో తమ ఇమేజ్ ను డ్యామేజ్ జరుగుతోందని భావిస్తున్నారట పలువురు స్టార్ హీరోలు.

రీసెంట్ గా రిలీజ్ అయిన మెగా మూవీస్ ధృవ.. ఖైదీ నంబర్ 150లను దాదాపు సొంతగానే రిలీజ్ చేసుకున్నారు. మరోవైపు నాగార్జున అయిన.. తన బ్యానర్ లో తీసిన సినిమాలను దాదాపు తనే రిలీజ్ చేసుకోవడం ఆనవాయితీ. ఇలా చేయడంతో విడుదల తర్వాత వచ్చే సమస్యల కారణంగా.. తర్వాతి ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నారట.

ఇదే కనుక జరిగితే.. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బలహీనపడిపోతుంది. స్టార్ హీరోలు సినిమాలు ఇవ్వకుంటే.. ఇక వీరికి మిగిలేది చిన్నా చితకా లో బడ్జెట్ మూవీస్ మాత్రమే. వాటితోనే ఏళ్లు గడపాలంటే దాదాపుగా అసాధ్యం. ఇదే జరిగితే.. మొత్తం డిస్ట్రిబ్యూషన్ రంగానికే దెబ్బ తగులుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/