Begin typing your search above and press return to search.
నటవారసులపై అగ్ర హీరోల డైలమా కంటిన్యూ..
By: Tupaki Desk | 14 Aug 2020 3:30 AM GMTనటవారసుల కెరీర్ నల్లేరుపై నడక లాంటిదేనని ఎవరన్నారో కానీ.. అందుకు పూర్తి విరుద్ధమైన సన్నివేశం చాలామంది నటవారసుల విషయంలో కనిపిస్తోంది. టాలీవుడ్ లో ఓ అగ్ర హీరో.. అలాగే కోలీవుడ్ లో ఓ అగ్రహీరో తమ నటవారసుల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. సక్సెస్ కోసం చాలానే నష్టాన్ని చవిచూడడమే గాక ఓపిగ్గా వేచి చూడాల్సిన సన్నివేశం ఉంది.
అక్కినేని నటవారసుడు అఖిల్ విషయంలో నాగార్జున చాలానే హైరానా పడుతున్నారు. అఖిల్ తాను ప్రతిభలో ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకునేందుకు ఎంతగా హార్డ్ వర్క్ చేస్తున్నా లక్ ఏమాత్రం ఫేవర్ చేయడం లేదు. దీంతో నాగ్ ఈ విషయంలో కాస్తంత టెన్షన్ లోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో అఖిల్ నాలుగో సినిమాతో అయినా బంపర్ హిట్ కొట్టి ట్రాక్ లోకి వస్తాడని నాగార్జున భావిస్తున్నారు. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` పై అక్కినేని అభిమానుల్లోనూ బోలెడన్ని ఆశలు ఉన్నాయి. అయితే ప్రస్తుత క్రైసిస్ సన్నివేశంలో ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలా? లేక ఓటీటీలో రిలీజ్ చేసేయాలా? అన్న సందిగ్ధత కొనసాగుతోందట.
`బ్యాచిలర్` నిర్మాతల వెర్షన్ ప్రకారం.. ఓటీటీ రిలీజ్ చేసేయడమే కరెక్ట్ అని అంటున్నారట. కానీ నాగార్జున మాత్రం ససేమిరా అనేస్తున్నారట. ఓటీటీ రిలీజ్ అంటే ఆ తర్వాత ఇక హీరోకి మార్కెట్ రేంజు పడిపోతుంది. అందుకే థియేట్రికల్ రిలీజ్ కే వేచి చూడాలని కష్ట నష్టాల్లో తానూ పాలుపంచుకుంటానని కింగ్ చిత్రనిర్మాతలకు మాటిచ్చారట. సంక్రాంతి రిలీజ్ కుదరకపోతే సమ్మర్ వరకూ వేచి చూడాలని కోరారట.
ఇక ఇక్కడ నాగార్జున పరిస్థితి ఇలా ఉంటే .. అటు కోలీవుడ్ లో చియాన్ విక్రమ్ కూడా తన వారసుడిని ప్రమోట్ చేసుకోవడంలో చతికిలబడ్డారని కోలీవుడ్ మీడియా చెబుతోంది. విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ నటించిన మొదటి సినిమా (అర్జున్ రెడ్డి రీమేక్) విషయంలో నెలకొన్న డైలమా గురించి తెలిసిందే. ఆ మూవీ విషయంలో తలెత్తిన వివాదాలు చాలా ఇబ్బంది పెట్టాయి. ఇక ఇటీవలే రెండో సినిమా చియాన్ 60 ని ప్రకటించారు. ఇందులో తండ్రి విక్రమ్ తో కలిసి ధృవ్ నటిస్తున్నాడు. అయితే ఇంతలోనే మహమ్మారీ తరుముకు రావడంతో ఈ ప్రాజెక్ట్ అనహ్యంగా వాయిదా పడిపోయింది. దీంతో ధృవ్ రెండో సినిమా ఎప్పటికి రిలీజవుతుంది? అన్నది డైలమాలో పడిపోయింది. తొలి సినిమాతో పాస్ మార్కులు వేయించుకున్న ధృవ్ ఈసారి ఎట్టిపరిస్థితిలో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న పంతంతో ఉన్నాడు. కానీ క్రైసిస్ లాక్ డౌన్ లు అందిరకీ ఇబ్బందికరంగా మారగా.. ఈ క్లిష్ఠ సమయం వారసుల కంటికి కునుకు పట్టనివ్వడం లేదని అర్థమవుతోంది.