Begin typing your search above and press return to search.
రేటింగ్ లపై స్టార్ హీరోల దృష్టి
By: Tupaki Desk | 15 Nov 2015 4:12 AM GMTఅవును, నిజం.. ఇప్పుడు బడా స్టార్లంతా రేటింగ్ లపై దృష్టిపెడుతున్నారు. రేటింగ్ లు అనగానే రివ్యూ రేటింగ్ లు అనుకుంటే పొరపాటే. మన స్టార్ లు ఆలోచిస్తుంది టి.ఆర్.పి రేటింగ్ ల గురించి. బుల్లితెర పై ఒక కార్యక్రమాన్ని ఎంత మంది వీక్షకులు ఆదరించారు అన్న గుణాంకాలను బట్టి టి.ఆర్.పి(టెలివిజన్ రేటింగ్ పాయింట్) ని నిర్ధారిస్తారు.
పెద్ద పెద్ద సినిమాలు కూడా 100రోజులు పూర్తికాకముందే బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్న ఈరోజుల్లో ఈ టి.ఆర్.పి రేటింగ్ స్టార్ల క్రేజ్ కి ఊతంగా మారింది. తెలుగు సినిమాలలో మగదీర్ చిత్రానికి మంచి టి.ఆర్.పి రేటింగ్ వుంది. ఇటీవల విడుదలైన బాహుబలి కూడా దాన్ని దాటలేకపోవడం గమనార్హం. అలానే టెంపర్ - గబ్బర్ సింగ్ లు సైతం రికార్డు రేటింగ్ లను సంతరించుకున్నాయి. తాజాగా టి.వి ప్రత్యక్షమైన మహేష్ శ్రీమంతుడు సినిమా రేటింగ్ పై డిస్కషన్ నడుస్తుంది.
టి.ఆర్.పి లు సినిమా సక్సెస్ నే కాకుండా ఛానెల్ వాళ్ళు చేసే ప్రచారాన్ని బట్టి కూడా మారడం గమనార్హం. అందుకే తమ సినిమాల ప్రదర్శన విషయాన్ని ప్రేక్షకుల దగ్గరకు వీలైనంత వినూత్నంగా తీసుకెళ్ళమని ఛానల్ వర్గాలకు సూచనలిస్తున్నట్టు తెలుస్తుంది.