Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: హీరోలు వ‌ర్సెస్ ఎగ్జిబిట‌ర్స్

By:  Tupaki Desk   |   26 Dec 2019 6:12 AM GMT
టాప్ స్టోరి: హీరోలు వ‌ర్సెస్ ఎగ్జిబిట‌ర్స్
X
థియేట‌ర్ యాజ‌మాన్య సంఘం(ఎగ్జిబిట‌ర్స్) తీసుకొచ్చిన కొత్త ప్ర‌తిపాద‌న‌ల‌కు కోలీవుడ్ ఒక్క‌సారిగా షాక్ కి గురైంది. ఎనిమిది శాతం ప‌న్ను మిన‌హాయింపు.. సినిమా ప్లాప్ అయితే వ‌చ్చే న‌ష్టాల‌ను హీరోలు భ‌రించ‌డం.. డిజిట‌ల్ స్ట్రీమింగ్ రిలీజ్.. త‌దిత‌ర వ్య‌వ‌హారాల‌పై కోలీవుడ్ థియేట‌ర్ యాజ‌మ‌న్య సంఘం కొత్త‌గా కొన్ని తీర్మానాలు ప్ర‌వేశ పెట్టింది. అమ‌లు చేయ‌క‌పోతే థియేర‌ట్లు మూసివేస్తామ‌ని హెచ్చ‌రించ‌డంతో ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌ అయోమ‌యంలో ప‌డింది. ఆ ప్ర‌భావం టాలీవుడ్ పైనా ప‌డే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌లు ఇప్ప‌టికే వేడెక్కిస్తున్నాయి. టాలీవుడ్ తీవ్ర న‌ష్టాల్లో ఉన్న నేప‌థ్యంలో కోలీవుడ్ సంఘాలు అనుస‌రించిన విధానాన్నే ఇక్క‌డి యాజ‌మాన్యాలు తెర‌పైకి తీసుకొచ్చే యోచ‌న చేస్తున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ బ‌లంగానే వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం కొత్త రూల్స్ పై కోలీవుడ్ థియేట‌ర్ యాజ‌మాన్యం సంఘం తీవ్ర క‌స‌ర‌త్త‌లు చేస్తోంది. ప్ర‌ధానంగా సినిమా ప్లాప్ అయితే ఆ న‌ష్టంలో కొంత‌ మొత్తం హీరోలు...అందులో న‌టించిన మిగ‌తా న‌టీన‌టులు చెల్లించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఇత‌ర షర‌తుల సంగ‌తి అటుంచితే.. హీరోలు మాత్రం క‌చ్చితంగా ఓట‌మి బాధ్య‌తను తీసుకోవాల్సిందేని ఒత్తిడి తీసుకొస్తున్న‌ట్లు వినిపిస్తోంది. అయితే ఎగ్జిబిట‌ర్స్ త‌మ‌కు వ‌చ్చే న‌ష్టాలు గురించే ప్ర‌స్తావిస్తున్నారు త‌ప్ప‌! సినిమా విజ‌యం సాధిస్తే వ‌చ్చే లాభాల గురించి మాత్రం నోరు మెద‌ప‌డం లేద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌పడుతున్నారు.

విజ‌యం సాధిస్తే లాభాలు హీరోల‌కు ఇస్తారా? అని సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నిర్ణ‌యాలు అనాలోచితంగా..అర్ధం లేకుండా ఉన్నాయ‌ని...సినిమా అనేది ఒక వ్యాపార‌మ‌ని దాన్ని అడ్డుపెట్టుకుని ఇలా అడ్డ‌గోలు ప్ర‌తిపాద‌న‌లు తీసుకురావ‌డం భావ్యం కాద‌ని అభిప్ర‌యాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రి ఈ ప్ర‌పోజ‌ల్ పై హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా ఈ వివాదం కోలీవుడ్ స‌హా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్ర‌భావం చూప‌డం మాత్రం ఖాయం. అయితే ఇరువ‌ర్గాల‌కు ఆమోద యోగ్య‌మ‌య్యేలా ప్రాక్టిక‌ల్ గా నియ‌మ‌నిబంధ‌న‌ల్ని రూపొందించాల్సి ఉంటుంద‌న్న అభిప్రాయం టాలీవుడ్ వ‌ర్గాల్లోనూ వ్య‌క్తమ‌వుతోంది.