Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ ఇంట్లోకి స్టార్‌ హీరోయిన్‌ వెళ్లనుంది

By:  Tupaki Desk   |   31 July 2019 6:28 AM GMT
బిగ్‌ బాస్‌ ఇంట్లోకి స్టార్‌ హీరోయిన్‌ వెళ్లనుంది
X
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అప్పుడే అయ్యింది కదా మళ్లీ స్టార్‌ హీరోయిన్‌ బిగ్‌ బాస్‌ ఇంట్లోకి వెళ్లడం ఏంటీ అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటీ అంటే బిగ్‌ బాస్‌ ప్రతి సీజన్‌ లో కూడా సినిమాల ప్రమోషన్‌ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ వారం బిగ్‌ బాస్‌ ఇంట్లో మన్మధుడు 2 చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అందుకోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిగ్‌ బాస్‌ ఇంట్లోకి ఎంటర్‌ అవ్వబోతుంది. నాగార్జున కూడా బిగ్‌ బాస్‌ లో మన్మధుడు 2 ప్రమోషన్స్‌ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది.

వీక్‌ డేస్‌ లో రకుల్‌ వెళ్లనుందా వీకెండ్స్‌ లో వెళ్లనుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. వీకెండ్స్‌ లో అయితే రకుల్‌ ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉండదు. అందుకే వీక్‌ డేస్‌ లోనే ఒక రోజు రకుల్‌ ను ఇంట్లోకి పంపించి మన్మధుడు 2 ప్రమోషన్స్‌ నిర్వహించాలని భావిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. జైలవకుశ చిత్రం ప్రమోషన్‌ కోసం మొదటి సీజన్‌ హోస్ట్‌ గా ఉన్న ఎన్టీఆర్‌ ఇంటి లోపలకు వెళ్లి సందడి చేసిన విషయం తెల్సిందే. అదే విధంగా నాగార్జున కూడా ఇంట్లోకి వెళ్తాడేమో చూడాలి.

రాహుల్‌ రవీంద్రన్‌ మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లు ఇప్పటికే బిగ్‌ బాస్‌ ఇంట్లోకి వెళ్లేందుకు సిద్దం అయ్యారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 9వ తారీకున ఈ చిత్రం విడుదల అవ్వబోతుంది. అంటే ఇంకా వారంకు ఎక్కువగానే ఉంది. కనుక ఈ వారంలో మన్మధుడు 2 టీం బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి వెళ్లక పోవచ్చు. వచ్చే శని ఆది వారాల్లో లేదంటే వచ్చే వారంలో ఏదైనా వీక్‌ డేస్‌ లో మన్మధుడు అండ్‌ టీం బిగ్‌ బాస్‌ ఎంట్రీ ఉండబోతుంది. మన్మధుడు 2 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే మంచి పబ్లిసిటీ చేసి చిత్రంపై అంచనాలు పెంచారు. బిగ్‌ బాస్‌ తో మరింత ప్రచారం కల్పించాలనేది నాగార్జున ప్లాన్‌ గా తెలుస్తోంది.