Begin typing your search above and press return to search.
దొంగ పనిలో ప్రొఫెషనలిజం కావాలంటే ఎలా
By: Tupaki Desk | 16 Nov 2016 7:30 PM GMTరద్దయిన నోట్లను మార్చుకునేందుకు జనాలు తిప్పలు పడుతుంటే.. నల్లడబ్బును తెల్లగా మార్చుకునేందుకు సెలబ్రిటీలు నానా అగచాట్లు పడుతున్నారు. కోట్ల కొద్దీ డబ్బును ఇంట్లో కూడబెట్టుకున్న డబ్బును.. ఇప్పుడు ఒక్కసారిగా ఆ అమౌంట్ ను వైట్ గా మార్చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకూ ఈ లిస్ట్ లో హీరోలే ఉన్నారని వార్తలు వస్తే.. అంతకు మించి ఓ హీరోయిన్ దగ్గర అమౌంట్ ఉందట.
కొన్ని రకాల వ్యాపారాలు కూడా చేస్తూ.. సౌత్ లో వెలిగిపోతున్న ఓ స్టార్ హీరోయిన్ ఇంట్లో ఏకంగా 18 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందట. ఈ మొత్తాన్ని వైట్ గా అంటే కొత్త 2వేల రూపాయల రూపంలోకి మార్చేందుకు గాను.. ఓ బ్రోకర్ ను ఆశ్రయించిందట ఈ బ్యూటీ. ఫోన్ లో డిస్కషన్స్ తర్వాత.. ఈ మొత్తాన్ని 25 శాతం కమీషన్ తో మార్చేందుకు అగ్రిమెంట్ కుదిరిందని తెలుస్తోంది. గవర్నమెంట్ కి చెబితే.. మొత్తం ఇచ్చేసి.. ఎదురు పెనాల్టీ కూడా కట్టాల్సి ఉండడం.. మార్కెట్లో 35-40 శాతం కమీషన్ నడుస్తుండడంతో.. ఈ 25 శాతానికి ఆనందంగా అంగీకరించిందట ఆ స్టార్ హీరోయిన్.
అయితే.. సరిగ్గా పేమెంట్స్ చేసుకునే సమయానికి 33 శాతం డిమాండ్ చేశాడట ఆ బ్రోకర్. ఆఖరి నిమిషంలో ఇలా మాట మార్చడం ప్రొఫెషనలిజం కాదు అని క్లాస్ పీకినా.. చివరకు అంగీకరించక తప్పలేదట. ఇప్పటికే ఈమె దగ్గర నుంచి అమౌంట్ చేతులు మారగా.. ఇంటికి రావాల్సిన కొత్త నోట్ల గురించి వెయిటింగ్ చేస్తోందని తెలుస్తోంది. అయినా.. నల్లడబ్బును తెల్లగా మార్చడమే దొంగపని. అందులోనూ ప్రొఫెషనలిజం కోరుకోవడం అంటే కామెడీనే కదా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/