Begin typing your search above and press return to search.
350 కోట్ల నష్టం వచ్చిందని స్టార్ హీరోయిన్ ఏమి చేసిందంటే..!
By: Tupaki Desk | 15 Aug 2021 7:30 AM GMTమార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో రూపొందిన ''బ్లాక్ విడో'' చిత్రాన్ని ఇటీవలే డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటాషా రోమనాఫ్ (బ్లాక్ విడో) పాత్రను హాలీవుడ్ హీరోయిన్ స్కార్లెట్ జొహాన్సన్ పోషించారు. 'అవెంజర్స్ ఎండ్ గేమ్' లో ముగిసిన ఈ క్యారక్టర్ ను ''బ్లాక్ విడో'' సిరీస్ గా మార్వెల్ రూపొందించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఫస్ట్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే తన చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కాకుండా డిజిటల్ రిలీజ్ చేయడం పట్ల స్కార్లెట్ - మార్వెల్ మధ్య వివాదం మొదలైంది.
'బ్లాక్ విడో' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడం వల్ల ఒప్పంద ఉల్లంఘన ద్వారా తనకు ఆర్థిక నష్టం కలిగించిందంటూ స్కార్లెట్ కోర్టుకెళ్లారు. ఇందుకుగాను తనకు 50 మిలియన్ల డాలర్లు (సుమారు రూ. 350 కోట్లు) నష్టం వచ్చిందని లాస్ ఏంజెల్స్ కోర్టులో ఆమె దావా వేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. అయితే స్కార్లెట్ - మార్వెల్ మధ్య వివాదం తారాస్థాయికి చేరడంతో.. భవిష్యత్తులో వీరు కలిసి వర్క్ చేయకపోవచ్చని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్కార్లెట్ ను తమ ప్రొడక్షన్ లోకి తీసుకురాడానికి డిటెక్టివ్ కామిక్స్ (డీసీ) ప్రయత్నాలు మొదలు పట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
సూపర్ హీరో మూవీస్ రూపొందించడంలో మార్వెల్ - డీసీ ల మధ్య ఎప్పటి నుంచో తీవ్ర పోటీ ఉందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్వెల్ నుంచి బయటకు వచ్చిన నటీనటులు - దర్శకులు - టెక్నిషియన్స్ ను డీసీ దగ్గరకు తీసుకుంటూ వస్తోంది. ఇప్పుడు 'బ్లాక్ విడో' వివాదంతో స్కార్లెట్ జొహాన్సన్ తో డీలింగ్ పెట్టుకోడానికి డిటెక్టివ్ కామిక్స్ సంప్రదింపులు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి. మరి దీనికి స్కార్లెట్ అంగీకరిస్తుందో లేదో చూడాలి.