Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ ఫిట్నెస్ ఫ్రీక్ వీడియో!!

By:  Tupaki Desk   |   19 Jan 2021 9:44 AM GMT
వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ ఫిట్నెస్ ఫ్రీక్ వీడియో!!
X
టాలీవుడ్ వయ్యారి రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ కి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆమె సినిమా సినిమాకు తీసుకునే కేర్.. ఫిట్నెస్ రూపంలో కనిపిస్తుంది. ఫిట్నెస్ విషయంలో రకుల్ ఎంతోమంది ఇండస్ట్రీ వారికి, ఇండస్ట్రీ బయటవారికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు. అమ్మడిని ఫిట్నెస్ అంశంలో ఫాలో అయ్యే కుర్రకారు లక్షలలో ఉన్నారు. ఫిట్‌నెస్ విషయానికి వస్తే రకుల్ అసలు అలుపులేకుండా శ్రమిస్తుంది. ఏ రోజు కూడా తను వ్యాయామం, జిమ్ లాంటి శారీరక వ్యాయామలకు బ్రేక్ ఇవ్వదు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా కనిపించే రకుల్ తన వారం ఎలా ప్రారంభించిందో.. క్లుప్తంగా ఇంస్టాగ్రామ్ వీడియో ద్వారా షేర్ చేసుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అలెర్ట్ గా ఉండే రకుల్.. పోస్ట్ చేసిన వీడియోలో వెయిట్ గల స్క్వాట్స్ చేయడం చూడవచ్చు.

రోజు తన దినచర్యను ఎలా ఫాలో అవుతుందో చెప్పుకొచ్చింది. అంతేగాక "లైఫ్ ఎప్పుడు హెచ్చు తగ్గులను కలిగి ఉంటుంది. నేను దానిని స్క్వాట్స్ అని పిలుస్తాను" అంటూ రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా.. రకుల్ త్వరలో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్ సినిమాలో నటించేందుకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాకు మేడే అనే పేరును ఖరారు చేశారు. అయితే ఈ సినిమాలో రకుల్ పైలట్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను హీరో అజయ్ దేవగన్ నిర్మిస్తూనే దర్శకత్వం వహించడం కూడా విశేషం. ఇక అజయ్ దేవగన్ సరసన రకుల్ ప్రీత్ నటించడం ఇది రెండోసారి. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో 'దేదే ప్యార్ దే' అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇవేగాక రకుల్ చేతిలో పలు తమిళ ప్రాజెక్టులు, తెలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయట. అమ్మడు మళ్లీ ఫామ్ కొనసాగించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. చూడాలి మరి రకుల్ ఏం చేస్తుందో..!