Begin typing your search above and press return to search.

తెలుగు తెరకు గ్లామర్ కష్టాలు

By:  Tupaki Desk   |   12 July 2016 10:30 PM GMT
తెలుగు తెరకు గ్లామర్ కష్టాలు
X
రోజుకో కొత్త హీరో వచ్చేస్తున్నాడు టాలీవుడ్లోకి. కానీ హీరోయిన్లే కనిపించడం లేదు. టాలెంట్-అందం రెండూ ఉన్న కొత్త హీరోయిన్లు రావట్లేదు. ఉన్నవాళ్లలో కొందరు ఫేడవుట్ అయిపోతున్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. డిమాండ్ ఉన్నవాళ్లు డేట్లు సర్దుబాటు చేయలేకపోతున్నారు. మొత్తానికి స్టార్ హీరోలు సైతం హీరోయిన్ల కొరతతో తెగ ఇబ్బంది పడిపోతున్నారు.

సమంత.. తమన్నా.. కాజల్.. కొన్నేళ్లుగా తెలుగు తెరను ఏలుతున్న గ్లామర్ క్వీన్స్. ఐతే ఈ ముగ్గురిలో ఒకరు ఫేడవుట్ అయిపోయారు. కాజల్ అగర్వాల్ గ్లామర్ దెబ్బ తింది. పైగా వరుసగా రెండు డిజాస్టర్లు ఎదురయ్యాయి. ఆమెకిప్పుడు పెద్ద సినిమాల్లో అవకాశమిచ్చే పరిస్థితి లేదు. మరోవైపు తమన్నా ఆల్రెడీ కమిటైన హిందీ.. తమిళ.. తెలుగు ప్రాజెక్టుల్లో లాక్ అయిపోయి ఉంది. కొత్తగా సినిమాలు ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఇక సమంత ప్రస్తుతానికి ఖాళీనే కానీ.. ఆమెకు ఇకపై సినిమాలు చేసే ఉద్దేశాలున్నట్లుగా కనిపించట్లేదు. పెళ్లిపైకి మనసు మళ్లినట్టుంది. ఆల్రెడీ కమిటైన ధనుష్ సినిమానే వదులుకుంది.

ఇక అనుష్క సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆమె సూటయ్యేదే కొందరికి. అది కూడా సీనియర్లకే. ఇప్పటికే 34 ఏళ్లొచ్చేశాయి ఆమె. చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి.. పెళ్లి చేసుకుని సెటిలైపోయే ఆలోచనలో ఉన్నట్లుందామె. నయనతార చిరంజీవి.. బాలయ్య లాంటి బడా హీరోలకే డేట్లివ్వలేని పరిస్థితిలో ఉంది. తమిళంలో ఆమె అంత బిజీ. ఉన్నంతలో స్టార్ హీరోయిన్లలో రకుల్ మాత్రమే అందుబాటులో ఉంది. ఆమె కోసం కూడా పోటీ ఎక్కువే ఉంది. రెజీనా.. రాశి ఖన్నా లాంటి హీరోయిన్లు ఓ స్థాయికి మించి ఎదగలేకపోతున్నారు. దీంతో స్టార్ హీరోలకు హీరోయిన్ల సమస్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఆల్రెడీ పని చేసిన వాళ్లనే రిపీట్ చేస్తున్నారు. కొత్తవాళ్లను ట్రై చేద్దామంటే తమ స్టేచర్ కు సరిపోతారో లేదో అన్న డౌటు. మొత్తానికి టాలీవుడ్ గ్లామర్ కష్టాలు మామూలుగా లేవిప్పుడు.