Begin typing your search above and press return to search.

బాడీ ఫిట్‌నెస్‌ పై స్టార్‌ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   12 March 2021 10:30 AM GMT
బాడీ ఫిట్‌నెస్‌ పై స్టార్‌ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X
సెలబ్రెటీలు తమ ఫిజిక్ పై శ్రద్ద తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఫిజిక్ పై శ్రద్ద లేకుంటే వారు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం మనుగడ సాధించడం కష్టం అవుతుంది. ముఖ్యంగా హీరోయిన్స్‌ మరీ సన్నగా కాకుండా మరీ లావు అవ్వకుండా ఎప్పటికప్పుడు ఫిట్ గా ప్రేక్షకులకు కనిపిస్తేనే సినిమాల్లో ఆఫర్లు వస్తాయి. ఫిట్ నెస్ అంటే కేవలం శరీరంకు సంబంధించింది మాత్రమే కాదంటూ హీరోయిన్ దీపిక పదుకునే ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈమె ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిజిక్ విషయమై మాట్లాడింది.

బాలీవుడ్‌ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపిక పదుకునే ఫిజిక్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత పది పన్నెండు ఏళ్లుగా ఆమె ఫిజిక్ అద్బుతం అన్నట్లుగానే ఉంటుంది. ఆమెను ప్రతి ఒక్కరు ఫిట్‌ నెస్‌ ను చూసి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఫిట్‌ నెస్ అనేది కేవలం బాడీకి మాత్రమే సంబంధించింది కాదని చెప్పుకొచ్చింది. బాడీతో పాటు మనసు కూడా ఫిట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఫిట్‌ నెస్ గా ఉన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. తాను బాడీతో పాటు మనసును కూడా ఎప్పుడు ఫిట్ గా ఉంచుకునేందుకు చెడు ఆలోచనలు తీసేస్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో పటాన్ సినిమాలో నటించడంతో పాటు త్వరలో ప్రభాస్.. నాగ్ అశ్విన్ సినిమాలో కూడా నటించబోతుంది.