Begin typing your search above and press return to search.

మిడ్ రేంజ్ హీరోల‌తో చేయ‌నంటోంద‌ట‌

By:  Tupaki Desk   |   4 Aug 2020 2:30 AM GMT
మిడ్ రేంజ్ హీరోల‌తో చేయ‌నంటోంద‌ట‌
X
టాలీవుడ్ లో వ‌రుస‌గా అగ్ర హీరోల‌తో సినిమాలు చేస్తూ స‌క్సెస్ అందుకుంటున్న ఓ స్టార్ హీరోయిన్ మిడ్ రేంజ్ హీరోల‌కు మాత్రం ఓకే చెప్ప‌డం లేదు. త‌న‌ని సంప్ర‌దించినా స‌సేమిరా అనేస్తోంద‌ట‌. ఇటీవ‌లే అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన ఓ పాపుల‌ర్ యంగ్ హీరో స‌ద‌రు ముంబై బ్యూటీని ఒప్పించాల‌ని చూసి విఫ‌ల‌మ‌య్యాడ‌ట‌.

ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఇలా మిడ్ రేంజ్ హీరోల్ని ప‌క్క‌న పెట్టేయ‌డం స‌రికాద‌ని విశ్లేషిస్తున్నారు. న‌య‌న‌తార‌.. కాజ‌ల్ .. స‌మంత‌.. త‌మ‌న్నా స‌హా ఎంద‌రో స్టార్ హీరోయిన్లు ఓవైపు అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టిస్తూనే న‌వ‌త‌రం హీరోల‌తోనూ సినిమాలు చేసేందుకు ప్ర‌య‌త్నించారు. మిడ్ రేంజ్ హీరో అన్న‌ది కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. వీళ్లెవ‌రూ అన‌వ‌స‌ర‌మైన హెడ్ వెయిట్ చూపించ‌లేదు. ఇక టాలీవుడ్ లోని ఓ అగ్ర నాయిక‌తో స‌ద‌రు ముంబై బ్యూటీ ఇంత‌కుముందు గొడ‌వ పెట్టుకోవ‌డంపైనా ప్ర‌ముఖంగా చ‌ర్చ సాగింది.

ఇదంతా చూస్తుంటే ఆవిడ వాల‌కం మార‌క‌పోతే మునుముందు క‌ష్ట‌మేన‌ని విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఒక అగ్ర క‌థానాయ‌కుడితో పీరియాడిక్ రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్ చేయ‌డ‌మే గాక‌.. ప్ర‌ముఖ న‌ట‌వార‌సుడితోనూ అదిరిపోయే రొమాంటిక్ ల‌వ్ స్టోరీలో న‌టిస్తోంది. ఇవి రెండూ పూర్త‌య్యాక అగ్ర హీరోల వ‌ర‌కే అనేస్తోంద‌ట‌. మ‌రీ ఇలా అయితే క‌ష్ట‌మేన‌నేది టాలీవుడ్ ఇన్ సైడ్ గుస‌గుస‌.