Begin typing your search above and press return to search.
హీరోయిన్ ఇంటికెళ్లి మరీ వేధింపులు.. వ్యక్తి అరెస్ట్
By: Tupaki Desk | 22 Dec 2021 3:30 AM GMTప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువొత్తు లైంగికవేధింపుల కేసులో పోలీసులను ఆశ్రయించింది. గత కొన్ని రోజుల నుంచి ఒక వ్యక్తి తనను తరచూ వేధిస్తున్నాడని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హర్ష అనే 35 ఏళ్ల వ్యక్తి తనను రోజు వేధిస్తున్నాడని.. డెలివరీ బాయ్ అవతారం ఎత్తి ఫుడ్ పేరుతో నిత్యం ఇంటికి వస్తున్నదని ఫిర్యాదులో తెలిపింది. తాను, తన కుటుంబం ఎంత చెప్పినా అతడు వినడం లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.
హర్ష అనే వ్యక్తి కొల్లాంలో నివాసముంటున్నాడు. అతడికి దాదాపుగా 34 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకూ వయసు ఉంటుంది. అతడు ఫుడ్ పార్శిల్ పట్టుకొని హీరోయిన్ ఇంటికి తరచుగా వస్తుండేవాడు. మొదటి సారి వచ్చినప్పుడే ఆహారాన్ని తీసుకురావద్దని పార్వతి కుటుంబం చెప్పింది. అయినప్పటికీ అతడు వినలేదు. ఆమెకు ఇబ్బంది కలిగిస్తూనే ఇంటికి వస్తుండేవాడు. సెక్యూరిటీతో గొడవ పెట్టుకునేవాడు.
గత కొన్ని ఏళ్లుగా ఆమె సెల్ ఫోన్ కు అసభ్యకర రీతిలో సందేశాలు పంపిస్తున్నాడు. దీంతో ఆ వ్యక్తిపై పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ 354డీ(స్టాకింగ్) సెక్షన్ కింద అతడిపై కేసును నమోదు చేశారు.
గత 2 ఏళ్ల క్రితం కూడా ఆమెకు ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయి. కిషోర్ అనే వ్యక్తి తనను తాను లాయర్, ఫిల్మ్ మేకర్ గా పార్వతి కుటుంబాన్ని పరిచయం చేసుకున్నాడు. హీరోయిన్ ని వేధింపులకు గురిచేశాడు.