Begin typing your search above and press return to search.
స్టార్ హీరోయిన్ వేదాంతం.. కారణం అదేనా?
By: Tupaki Desk | 28 April 2021 10:49 AM GMTసినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు వారి మూడ్ బట్టి ఒక్కోసారి ఒక్కోలా వేదాంతం చెప్పుకొస్తుంటారు. అదికూడా ఫిలాసఫీలు చెప్పాల్సిన వారు చెబితే బాగానే ఉంటుంది. కానీ ఎక్సపెక్ట్ చేయనివారు కూడా ఫిలాసఫీలు చెప్పేస్తుంటే అప్పుడప్పుడు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. నిజానికి సినిమాల్లో ఫిలాసఫీలు చెప్పే సెలబ్రిటీలు బయట కూడా అలాగే లైఫ్ లీడ్ చేస్తారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సినీజీవితం నిజజీవితం రెండూ వేర్వేరుగా ఉంటాయి. మరి జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలితే గాని నోట్లో నుండి వేదాంతం బయటికి రాదంటారు. మరి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా.. 'లైఫ్ లో ఇలా ఉండాలి.. అలా ఉండాలని చెబుతోంది' ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
నిజానికి శృతి ఏమంటుంది అంటే.. మన లైఫ్ ఎదుటివారికి నచ్చేలా బ్రతకడమే చాలా పెద్ద రిస్క్ అంటోంది. అలాగే ఎదుటివారికి నచ్చేలా దుస్తులు, మాటలు, ప్రవర్తన ఇలా అన్నివిధాలా వారికోసం జీవించడం రిస్క్. ఎందుకంటే ఎదుటివారిలో ఎప్పటికప్పుడు అభిరుచులు మారుతుంటాయని చెబుతోంది. మరి ఎన్నడూ లేనిది శృతి.. ఇలా వేదాంతం చెప్పుకొస్తుంది ఏంటని ఆలోచనలో పడుతున్నారు నేటిజన్లు. కానీ శృతి ఇలా ఎందుకు చేసిందో కారణం అదే అయ్యుండొచ్చు అంటూ ఓ విషయం వైరల్ అవుతోంది. ఆమె లవ్ - బ్రేకప్ విషయం నుండే అమ్మడు ఈ అంశాలన్నీ గ్రహించి ఉంటుందని టాక్. ఎందుకంటే ఒకప్పుడు ప్రియుడి కోసం సినిమాలకు దూరమైంది. బ్రేకప్ తరువాత మళ్లీ సినిమాలే చేసుకుంటుంది. అదే కావచ్చు ఆమె చేసిన పెద్ద రిస్క్ అని భావిస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శృతి ప్రభాస్ సరసన సలార్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తోంది.