Begin typing your search above and press return to search.
స్టార్ హీరోయిన్ రెండో పెళ్లికి రెడీ అయిందా..?
By: Tupaki Desk | 23 Sep 2022 5:39 AM GMTగ్లామర్ ఫీల్డ్ లో రూమర్స్ అనేవి సర్వసాధారణం. సినిమాల కంటే వారి వ్యక్తిగత జీవితం గురించే ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. హీరో హీరోయిన్ల మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని.. ఫలానా జంట మధ్య విభేదాలు వచ్చాయని.. విడాకులు తీసుకోబోతున్నారని.. ఇలా నిత్యం ఏదో వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటుంది.
అయితే ఇప్పుడు ఓ సౌత్ స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందనేది తెలియదు కానీ.. దాదాపు కన్ఫర్మ్ అయినట్లేనని వార్తలు వైరల్ అవుతున్నాయి. రెండో పెళ్లి కోసం ఆమెను సన్నిహితులు ఒప్పించారని అంటున్నారు.
నిజానికి ఆ హీరోయిన్ గతంలో తన కో యాక్టర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నాళ్ళు డేటింగ్ చేసి ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం ఎంతో అన్యోన్యంగా ఆదర్శ దంపతులుగా జీవించిన ఈ స్టార్ కపుల్ మధ్య విభేదాలు వచ్చాయి.
ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో చివరకు పరస్పర అంగీకారంతో విడిపోయారు. అయితే విడాకుల తర్వాత ఆమె చాలా డిప్రెషన్ కి లోనైంది. దాన్నుంచి బయటికి రావడం కోసం ఎంతగానో ప్రయత్నాలు చేసినట్లుగా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఆమె కెరీర్ మీదనే పూర్తిగా దృష్టి పెట్టినప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలను మాత్రం మర్చిపోలేకపోతోందట. అగ్ర నటి అనుభవిస్తున్న బాధను గమినించిన ఆమె హితులు.. మరో పెళ్లి చేసుకొని మూవ్ ఆన్ అవ్వాలని సలహా ఇచ్చారట. ఈ మేరకు ఆమెని రెండో పెళ్లికి ఒప్పించారని పుకార్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు తన మాజీ భర్త కూడా మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వస్తున్న నేపథ్యంలో.. కావాలనే కొందరు స్టార్ హీరోయిన్ పెళ్లి గురించి పుకార్లు పుట్టిస్తున్నారని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.
అయితే రెండో పెళ్లి వార్తలపై ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు. గాసిప్స్ మామూలే కదా అని ఇలాంటి ఏమాత్రం పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారా? లేదా వీటిపై స్పందించి అందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.