Begin typing your search above and press return to search.
రష్యా సైనికులు దారుణాలపై స్టార్ హీరోయిన్!
By: Tupaki Desk | 9 April 2022 10:37 AM GMTరష్యా.. ఉక్రెయిన్ మద్య జరుగుతున్న యుద్దం ముగింపు దశకు చేరుకున్నట్లుగా అనిపిస్తున్నా కూడా ఉక్రెయిన్ లో మారణ హోం జరుగుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా రష్యా సైనికులు సాగిస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అంతర్జాతీయ సమాజం ఎంతగా తిట్టి పోస్తున్నా కూడా రష్యా మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
ఈమద్య ఉక్రెయిన్ లో ఆడవారి పై రష్యా సైనికులు సామూహిక మానభంగాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా తయారు అయ్యింది. రష్యా సైనికులు తమ ఇద్దరు సోదరిల పై అఘాయిత్యం చేశారని.. తనపై కూడా అఘాయిత్యం చేస్తారేమో అనే భయంతో అందంగా కనిపించకూడదు అని జుట్టు కత్తిరించుకుంటున్నట్లుగా ఒక మహిళ చేసిన వ్యాఖ్యలు ప్రపంచంను నివ్వెర పోయేలా చేశాయి.
ఉక్రెయిన్ లో జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డు కట్ట వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని.. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఏం చేస్తుందంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకుని హాలీవుడ్ స్టార్స్ కు పోటీగా నిలుస్తున్న ప్రియాంక చోప్రా ఉక్రెయిన్ అఘాయిత్యాలపై స్పందించారు.
ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు.. ఆ వీడియో లో ఆమె మాట్లాడుతూ.. రెండవ ప్రపంచ యుద్దం సమయంలో కనిపించిన పరిస్థితులు ఇప్పుడు ఉక్రెయిన్ లో ఉన్నాయి. అక్కడ పిల్లలు చెల్లా చెదురుగా అయిపోయారు. ఈ సమయంలో ప్రపంచ నాయకులు అంతా కూడా ముందుకు వచ్చి ఉక్రెయిన్ ను కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలంటూ ఆమె విజ్ఞప్తి చేసింది.
ఇంకా పీసీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ శరణార్థులకు ప్రతి ఒక్కరు సహాయం చేయాలి. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారు విరాళాలు ఇచ్చి వారి సహాయ నిధి కోసం పాటు పడాలంటూ విజ్ఞప్తి చేసింది. ప్రపంచ స్థాయిలో విరాళాలు సేకరిస్తున్న యూనిసెఫ్ విరాళాల లింక్ ను కూడా ప్రియాంక చోప్రా షేర్ చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ విరాళాల సేకరణ కు ప్రియాంక చోప్రా ప్రమోటర్ గా వ్యవహరిస్తుంది. ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఉక్రెయిన్ కు మద్దతుగా ఉండాలని ఆమె కోరుతున్నారు.