Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ సీక్రెట్ గా బెదిరిస్తోందా?

By:  Tupaki Desk   |   12 July 2017 12:30 AM GMT
స్టార్ హీరోయిన్ సీక్రెట్ గా బెదిరిస్తోందా?
X
ఆమె ఒక స్టార్ హీరోయిన్. సౌత్ అంతా బోలెడంత గుర్తింపు ఉన్న భామ. టాలీవుడ్ లో అయితే.. ఈమె ఉంటే సినిమాకి వసూళ్ల పండగే అంటారు. ఒకట్రెండు సార్లు మినహాయిస్తే.. ఇప్పటివరకూ ఇదే జరిగింది. ఇకపై జరుగుతుందని ఇండస్ట్రీ జనాలకు మాంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పటికే ఓ హీరోను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయిన ఈమె.. కాబోయే అత్తారింటికి ఓ సీక్రెట్ మెసేజ్ పంపుతోందనే టాక్ వినిపిస్తోంది.

ఎంతటి హాట్ హీరోయిన్స్ అయినా.. పెళ్లయిన తర్వాత యాక్టింగ్.. అందులోనూ హీరోయిన్ గా కొనసాగడం మన దగ్గర కనిపించదు. కానీ ఈమె మాత్రం పెళ్లి తర్వాత కూడా తను కొనసాగుతానని ఇప్పటికే చెప్పింది. అవన్నీ మాటలేలే.. జరిగినప్పుడు చూద్దాం అనుకున్న వాళ్లకి.. ఈ హీరోయిన్ వాలకం షాక్ కొట్టించేస్తోంది. ఈ స్టార్ భామ చేస్తున్న ఫోటోషూట్స్ చూస్తుంటే మతి పోవడం ఖాయం. హాట్ లుక్స్ తో పోజులు ఇస్తూ.. ఇప్పటికీ తన క్రేజ్ ను కొనసాగిస్తోంది. తను ఇలాగే ఉంటానని చెప్పకనే చెబుతోందీ హీరోయిన్.

అయితే.. ఈమె స్టైలింగ్ స్టేట్మెంట్ ఇలా ఉండడం వెనక.. కాబోయే అత్తారింటికి పంపుతున్న మెసేజ్ వేరే ఉందని టాక్ వినిపిస్తోంది. ఎంగేజ్మెంట్ తర్వాత కూడా తను గతంలో ఎలా ఉందో అలాగే ఉంటోందంటే.. పెళ్లి తర్వాత కూడా తన తీరు ఇదే అని చెప్పకనే చెప్పేందుకు చేసే ప్రయత్నమే అంటున్నారంతా. మరి ఇందులో నిజం ఎంతో తెలీదు కానీ.. అమ్మడి అభిమానులు మాత్రం ఈ విషయంపై తెగ హ్యాపీగా ఉన్నారులే.