Begin typing your search above and press return to search.
85 ఏళ్ల బామ్మగా హాట్ స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 26 Oct 2019 5:47 AM GMTతమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు.. హిందీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఇండియన్ 2'. దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కమల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటిస్తున్న విషయం తెల్సిందే. రెండు పుష్కరాలకు ముందు వచ్చిన 'ఇండియన్' చిత్రంకు ఇది సీక్వెల్ అనే విషయం తెల్సిందే. ఇండియన్ సినిమాలోని సేనాపతి పాత్ర 'ఇండియన్ 2'లో కూడా కొనసాగబోతున్న విషయం తెల్సిందే.
ఇండియన్ 2 చిత్రంలో కమల్ 90 ఏళ్ల సేనాపతి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో కమల్ కు జోడీగా కాజల్ అంటున్నారు కనుక ఆమె యంగ్ గా ఎలా కనిపిస్తుంది. ఆమె కూడా బామ్మగానే కనిపించబోతుందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 85 ఏళ్ల వయసు ఉండే బామ్మ పాత్రలో కాజల్ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. శంకర్ సినిమాలో ప్రతి పాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడు. అలాగే కాజల్ పాత్ర సేనాపతి భార్య కనుక చాలా ప్రాముఖ్యత ఉండే ఉంటుంది.
కాజల్ పాత్ర కోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టులను రప్పించి మరీ ఆమెకు మేకప్ వేయిస్తున్నారట. ఇప్పటి వరకు కాజల్ షూట్ కు వెళ్లిందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కాజల్ తో పాటు ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఇండియన్ 2 చిత్రంతో కాజల్ ఎలాంటి గుర్తింపును దక్కించుకుంటుందో చూడాలి.